అర్జున్ రెడ్డి సంచలన విజయంతో ఒక్కసారిగా నైట్ నైట్‌కే స్టార్ అయిపోయిన బబ్లీ గర్ల్ షాలినీ పాండె. అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఆమెకు ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్‌లో కూడా మంచి అవకాశం తలుపుతట్టింది. షాలీని పాండె తాజాగా తమిళ్‌లో నటిస్తున్న తాజా చిద్రం 100% కాదల్ . తెలుగులో క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ చెక్కిన క్యూట్ లవ్‌స్టోరీ 100%లవ్‌కి రీమేక్ ఈచిత్రం.
అయితే తమిళ్ రీమేక్‌లో జీవీ ప్రకాష్ హీరోగా నటిస్తోండగా.. హీరోయిన్‌గా మొదట లావణ్య త్రిపాఠిని ఎంపిక చేసుకున్నారు నిర్మాతలు. ఈ మూవీని స్టార్ట్ చేసి కొంత పార్ట్ చిత్రీకరించిన తర్వాత లావణ్య హఠాత్తుగా ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొంది. దీంతో తమిళనాడు నిర్మాతల సంఘం ఆమె మీద మూడు కోట్ల రూపాయల జరిమానా విధించారనే వార్తలు కూడా వచ్చిన విషయం తెలిసిందే.
ఇక ఆ చిత్రం నుండి లావణ్య త్రిపాఠి తప్పుకొన్న తరువాత ఆ ఛాన్స్ షాలినీ పాండే కొట్టేసింది. జీవీ ప్రకాశ్ సరసన నటిస్తోంది షాలినీ. షాలినీ ఫస్ట్‌లుక్‌ను ఆదివారం విడుదల చేసింది చిత్రం యూనిట్. యాజ్‌టీజ్ తెలుగులో ఉన్నట్టుగానే తమన్నా నడుము పై చైతూ కాపీ కొట్టే సీన్‌నే.. అచ్చం తమిళ్‌లో కూడా డిజైన్ చేసి ఫస్ట్ లుక్‌గా వదిలారు చిత్ర యూనిట్. దీంతో ఈ ఫస్ట్ లుక్ పై విపరీతమైన స్పందన వస్తోంది. దీంతో తమిళంలో కూడా ఈ చిత్రం ఘనవిజయం సాధించడం ఖాయమని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.