రష్మీ.. చాలా కాలం నుంచినే ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ, జబర్దస్త్ తో ఈమెకు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. ఆ టీవీ షోతో దక్కిన గుర్తింపుతో సినిమా అవకాశాలు కూడా పెరిగాయి. ‘గుంటూర్ టాకీస్’సినిమాలో రేష్మీ గ్లామర్ షో సంచలనంగా నిలిచింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడానికి కారణాల్లో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత రేష్మీ ఇమేజ్ ను సొమ్ము చేసుకోవడానికే అన్నట్టుగా కొన్ని సినిమాలు విడుదల అయ్యాయి. అవేవీ నిలబడలేదు..
అంతేకాదు, జబర్దస్త్’ షో కామెడీతో పాటు యాంకర్ రష్మి చిట్టి పొట్టి డ్రెస్సులతో ఆ షోని మరింత హిటేక్కించింది. ఇదిలా ఉంటే… రష్మిగౌతమ్, జబర్దస్త్ కామెడీ షో టీమ్ లీడర్ సుడిగాలి సుధీర్ మధ్య ఎఫైర్ ఉందని కొంతకాలంగా సోషల్ మీడియాలో రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఇందుకు ప్రధాన కారణం జబర్దస్త్ స్కిట్లు చేసేప్పుడు కూడా టీమ్ మెంబర్స్ ఇద్దరిపై సెటైర్లు వేయడం ఓ కారణం అయితే, రష్మి, సుధీర్ కూడా చాలా సన్నిహితంగా ఉండడం చూసి ఎవ్వరికైనా ఈ అనుమానం రాక తప్పదు. జబర్దస్త్ కామెడీ షోలో సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయమే ప్రేమగా మారిందని, ప్రస్తుతం పీకల్లోతు ఎఫైర్లో ఉన్నారని, సహజీవనం చేస్తున్నారని, ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకుంటున్నారంటూ కొంతకాలంగా రకరకాల ప్రచారం కూడా జరుగుతోంది. దీనికి కారణం వారిద్దరు కలిసి చేసే షోలలో చేసే ఓవర్ యాక్షనే.
తాజాగా రష్మీ నటించిన నెక్స్ట్ నువ్వే చిత్రంలో ”నీకు గడ్డివాము దగ్గర కుక్క గురించి తెల్సా.. అది తినదు ఇంకొకర్ని తిన్నీయదు, అబ్బా నొప్పి’’ అంటూ స్పైసీ లుక్స్‌తో క్రేజీ కోరికలతో యాంకర్ రష్మి ‘గుంటూరు టాకీస్’ లాంటి మసాలాను నెక్స్ట్ నువ్వే సినిమాలో దట్టించింది. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్రం అటు మంచి రేటింగ్స్‌తోను, ఇటు పాజిటివ్ టాక్‌ను దక్కించుకుని థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.
అయితే, నెక్స్ట్ నువ్వే చిత్ర ప్రమోషన్‌లో భాగంగా రష్మీని సుధీర్ ఇంటర్వ్యూ చేశాడు. నెక్స్ట్ నువ్వే సినిమా పేరు మీద నువ్వు నన్ను పొగడాలి అంటూ రష్మీ సుధీర్‌తో అనగా.. అందుకు సుధీర్ ససేమీరా అన్నప్పటికీ.. చివరకు రష్మీ దారిలోకే వచ్చాడు. రష్మీ.. నా ప్రేమ కావాలంటే.. నీవు నన్ను పొగడాలని అనడంతో సుధీర్ పొగడ్తలను స్టార్ట్ చేశాడు.
ఇప్పుడున్న అమ్మాయిలందరినీ వదిలేసిన తరువాత నెక్స్ట్ నువ్వే, టాలీవుడ్‌లోని టాప్ మోస్ట్ హీరోయిన్ నెక్ట్స్ నువ్వే, బాలీవుడ్‌లోనూ టాప్ మోస్ట్ హీరోయిన్ నువ్వే అంటూ సుధీర్ పొగడ్తలకు అబ్బబ్బా నొప్పి అంటూ నెక్స్ట్ నువ్వే చిత్రంలోని తన డైలాగ్‌ను రివీల్ చేసింది రష్మీ.
ఇలా.. సుధీర్ తన జబర్దస్త్ పంచ్‌లతో రష్మీని ఇంటర్వ్యూ చేస్తూ నవ్వులు పూయించాడు.