ముఖ్యమంత్రి కేసీఆర్ ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీలతో సమావేశమయ్యారు. 2018 ఏప్రిల్ నుంచి వ్యవసాయానికి 24గంటల విద్యుత్ సరఫరాకు సీఎం ఆదేశాలు జారీచేశారు. దీనిలో భాగంగా సోమవారం రాత్రి (రేపటి) నుంచి ప్రయోగాత్మకంగా 3 జిల్లాల్లో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు వారంలో ఆరు రోజులపాటు ప్రయోగాత్మకంగా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రయోగాత్మకంగా విద్యుత్ సరఫరాలో లోటు పాట్లను అంచనా వేయనున్నారు. లోటుపాట్ల అంచనాలతో 2018 ఏప్రిల్ నుంచి నిరంతర విద్యుత్ సరఫరాకు సన్నాహాలు చేస్తున్నారు.
