సిద్దిపేటలోని కోమటిచెరువును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పొచారం శ్రీనివాస రెడ్డి, TSCAB చైర్మన్ కొండూరు రవీందర్ రావు ఆదివారం పరిశీలించారు.రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఒక చెరువును మినీ ట్యాంక్ బండ్ గ అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఉద్యేశం అని మంత్రి పోచారం చెప్పారు. సిద్దిపేటకు సంబంధించి కోమటి చెరువును అద్భుతంగా తీర్చిదిద్దారన్నారు. స్థానిక శాసనసభ్యుడు, మంత్రి హరీశ్ రావు ప్రత్యేక శ్రద్దతో ఇంత చక్కగా సుందరీకరణ సాద్యమయిందన్నారు.
చెరువు కట్టపై నడకదారి, గ్రీనరి బాగుందని చెప్పారు. రక్షణ కోసం రెండువైపులా రైయిలింగ్ నిర్మించారని, సందర్శకులు సేదతీరటానికి ప్రత్యేకంగా హట్స్ నిర్మాణం కూర్చోవడానికి రాతితో కూడిన బేంచీలు ఏర్పాటు చేయడం కొత్త పద్దతి అని మంత్రి ప్రశంసించారుపిల్లలకు తినుబండారాలకు స్టాల్స్ ఏర్పాటు చేయడం, త్రాగు నీరు, పరిశుభ్రమైన వాతావరణం కోసం మూత్రశాలలు ఏర్పాటు బాగున్నాయన్నారు.సందర్శకులకు బోటింగ్ తో మంచి ఎంటరటైనమెంట్ లబిస్తుందన్నారు. పట్టణ వాతావరణం నుండి దూరంగా కుటుంబ సభ్యులతో కలసి ప్రశాంత వాతావరణంలో సేదతీరటానికి ఈ మినీ ట్యాంక్ బండ్ లు ఉపయోగపడుతాయని పోచారం అభిప్రాయ పడ్డారు.
కోమటి చెరువు రాష్ట్రంలోని మిగతా మినీ ట్యాంక్ బండ్ ల నిర్మాణానికి మోడల్ గా నిలుస్తుందన్నారు. తన నియోజకవర్గంలో బాన్సువాడ కల్కి చెరువును మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చెసే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపారు. ముల్కనూరు సహకార గ్రామీణ బ్యాంకు వజ్రోత్సవాలలో పాల్గొనడానికి కామారెడ్ఢి నుండి హుస్నాబాద్ వెళుతూ మార్గమద్యంలో సిద్దిపేట లోని కోమటిచెరువును మంత్రి పోచారం పరిశీలించారు. చెరువు కట్టపై తిరుగుతూ నిర్మాణాలను పరిశీలించి అభినందించారు. వసతులపై సందర్శకులను వివరాలు అడిగి, చిన్న పిల్లలతో సరదాగా గడిపారు. బోటింగ్ పై టూరిజం శాఖ ఉద్యోగులతో మంత్రి మాట్లాడారు.