ఉత్తర ప్రదేశ్‌లో గత రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ హైవేపై కన్నౌజ్ ప్రాంతం వద్ద ఓ కారు ప్రమాదానికి గురికాగా అందులోని ఆరుగురు సజీవ దహనం అయ్యారు.
వీరిలో ఇద్దరు మైనర్లు(2,3 ఏళ్లు) కూడా ఉండటం శోచనీయం.అర్థరాత్రి 2గం 15 ని. ప్రాంతంలో హుషేపూర్ గ్రామం వద్దకు చేరుకుంది. డివైడర్‌ను బలంగా ఢీకొట్టిన కారు పల్టీలు కొడుతూ చాలా దూరం వెళ్లింది.
అనంతరం ఒక్కసారిగా మంటలు చెలరేగి అందులోని వారు దహనం అయ్యారు. వారంతా బిహార్ ఛ్చాత్ వేడుకల్లో పాల్గొని తిరిగి మిథాపూర్‌కు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు భావిస్తున్నారు.