సమాజంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న లైంగిక వేధింపులు నివారించేందుకు ఆయా ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల సహకారంతో పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. చిన్నారులపై లైంగిక వేధింపులు, అవగాహన, ఫిర్యాదులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం కల్పించనున్నారు. జాగో.., బదలో.., బోలో.. నినాదంతో పోలీస్ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమంలో సింగర్ సునితీ పాల్గొన్నారు. అమ్మాయిలు తమపై జరుగుతున్న, జరిగిన లైంగిక వేధింపుల విషయంలో గళం విప్పాలని పిలుపునిచ్చారు సునీత.
లైంగిక వేధింపులపై మాట్లాడేందుకు సిగ్గు, బిడియం, పరువు ప్రతిష్ఠలు ఆటంకాలని, దీని వల్ల వేధింపులకు గురవుతున్న చిన్నారులు దానిపై బయటకు చెప్పుకునేందుకు అవకాశం లేకుండా పోయిందని.. ఇకపై అలా జరగకూడదని అన్నారు. ` ప్రతి ఆడపిల్ల తమపై జరుగుతున్న, జరిగిన లైంగిక వేధింపులను ధైర్యంగా బయటపెట్టాలని, లైంగిక వేధింపులు, దాడులు, హింసకు వ్యతిరేకంగా ప్రతిఒక్కరూ గళం విప్పాలని కోరారుసునీతా. అనంతరం హిందీ పాట ఒకటి పాడి వినిపించింది.