ఇవాళ కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత.. నిజామాబాద్ పట్టణంలోని శ్రీనీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఎంపీ కవిత మీడియాతో మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కార్తీక పౌర్ణమి రోజున శ్రీనీలకంఠేశ్వర స్వామి వారి ఆలయంలో పూజలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ ఏడాది కూడా ఆ శివుడి దయ వల్ల ఇక్కడ అభిషేకం చేయడం జరిగిందన్నారు. శ్రీనీలకంఠేశ్వర స్వామికి ప్రాచీనమైన చరిత్ర ఉన్నదని చెప్పారు. ఆలయ అభివృద్ధికి తమ ప్రభుత్వం తరపున కృషి చేస్తున్నామని ఎంపీ కవిత స్పష్టం చేశారు.
Tags CELEBRATES KARTIK PURNIMA MP KAVITHA NIZAMABAD SRI NEELAKANTESHWARA TEMPLE telangana