తమిళనాట సంచలనం రేపిన విజయ్ తాజా చిత్రం మెర్సల్ తెలుగులో నవంబర్ రెండో వారంలో విడుదల కానుంది. అదిరింది పేరుతో దీపావళికి తెలుగులో విడుదల కావాల్సిన ఈ చిత్రం అనూహ్యంగా ఆగిపోయింది. అక్టోబర్ 27 రిలీజవుతుందని నిర్మాతలు తాజాగా ప్రకటించినా, సెన్సార్ నుండి గ్రీన్‌సిగ్నల్ రాకపోవడంతో అక్టోబర్ 27 కూడా ఈ సినిమా రిలీజ్ ఆగిపోయింది.
అయితే తాజాగా ఈ చిత్రానికి అన్ని సమస్యలూ తీరాయి. సినిమాని నవంబర్ 9న రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.ఇక ఈ సినిమాలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా డైలాగ్‌లు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తటమే సమస్యలకు కారణమైంది. అదే సమయంలో డాక్టర్లను కూడా అవమానకరంగా చూపించారంటూ నిరసనలకు దిగటంతో మెర్సల్ సినిమాపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఈ వివాదాలతో భారీ పబ్లిసిటీ పొందిన మెర్సల్ రికార్డ్ కలెక్షన్లు సాధించి సత్తా చాటింది.
అయితే తమిళ సినిమాతో పాటు తెలుగు డబ్బింగ్ వర్షన్ అదిరిందిని కూడా రిలీజ్ చేయాలని భావించారు చిత్రయూనిట్. కాని అనుకున్న సమయానికి తెలుగు వర్షన్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాకపోవటంతో రిలీజ్ పలుమార్లు వాయిదా పడింది. తెలుగు నిర్మాతలు రెండు మూడు సార్లు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసినా సినిమా రిలీజ్ కాలేదు. తాజాగా అదిరింది రిలీజ్‌ను తమిల నిర్మాతలు పూర్తిగా పక్కన పెట్టేశారన్న ప్రచారం జరిగింది. అయితే అవన్నీ రూమర్సే అని రిలీజ్ డేట్ ప్రకటనతో నిర్మాతలు తేల్చి చెప్పారు.