ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాంచి ఊపుమీదున్న హీరోయిన్ ఎవరంటే మరో మాట లేకుండా మెహ్రీన్ కౌర్ పేరు చెప్పేయొచ్చు. మెహ్రీన్ నటిగా అంత ప్రతిభావంతమైనది కాకపోయినా, తన క్యూట్ నెస్‌తో తెలుగు నాట మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. టాలీవుడ్‌లో వరస పెట్టి అవకాశాలతో, విజయవంతమైన సినిమాలతో దూసుకుపోతోంది ఈ ప్రెటీ గాళ్.
కాస్తంత బొద్దుగా ఉండే ఈ భామ ఇప్పుడు తన హాట్‌నెస్ తో వార్తల్లోకి వస్తోంది. జవాన్ సినిమా సాంగ్ టీజర్ లో మెహ్రీన్ ను చూసి కుర్రకారు వెర్రెత్తిపోతున్నారు. టీజరే అలా ఉందంటే.. ఆ సినిమా విడుదల అయితే మెహ్రీన్ ప్రేక్షకుల గుండెల్లో గట్టి ముద్రనే వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కృష్ణగాడి వీర ప్రేమ గాద, మహానుభావుడు, రాజా ది గ్రేట్ చిత్రాల్లో సాంప్రదాయంగా కనిపించిన మెహ్రీన్ మెగా హీరో చిత్రంలో గ్లామర్ గేట్లు ఏత్తేసింది.
సాయి ధరం తేజ్ తో కలిసి నటిస్తున్న జవాన్ మూవీలో మాత్రం గ్లామర్ డోస్ మామూలుగా పెంచలేదని చెప్పొచ్చు. ఇప్పటి వరకు తనలోని సాంప్రదాయాన్ని చూపించిన మెహ్రీన్ జవాన్ మూవీలో బుగ్గంచున సాంగ్ టీజర్‌లో మాత్రం తనలో ఉన్న హాట్ నెస్‌ని చూపించేసింది. జస్ట్ సాంగ్ టీజర్‌తోనే కాక రేపిన మెహ్రీన్ ఈ సినిమాలో ఎలా రెచ్చిపోతుందో అని సినీ ప్రియులు చర్చించుకుంటున్నారు.