దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ పర్యటన వరుసగా రెండో రోజు కొనసాగుతోంది. వరల్డ్ ఫుడ్ ఇండియా-2017 సదస్సుకు హాజరైన మంత్రి ఈ సందర్భంగా పలు సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం తరఫు అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ప్రభుత్వం తరపున పరిశ్రమల శాఖా ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఒప్పందం కుదుర్చుకున్నారు. సుమారు 1250 కోట్ల రూపాయల విలువైన 9 ఒప్పందాలను తెలంగాణ ప్రభుత్వం ఆయా సంస్థలతో చేసుకుంది.
మంత్రి కేటీఆర్ చొరవతో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థల్లో బికానీర్ వాలా, ప్రయాగ్ న్యూట్రీ మేన్స్ ఫుడ్స్, కనోరియ గ్రూప్ కు చెందినా అన్నపూర్ణ ఫుడ్స్, కరాచీ బెకరీ, బ్లూ క్రాఫ్ట్ ఆగ్రో, సంప్రీ గ్రూప్, క్రీం లైన్ డైరీ, పుష్య ఫుడ్స్ సంస్థలు ఉన్నాయి. ఈ ఒప్పందాల వల్ల సుమారు 3800 మందికి నేరుగా ఉద్యోగావకాశాలు వస్తాయి. దీంతో పాటుగా మరో 20 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది. దీంతోపాటుగా 20 వేల మంది రైతులకు వ్యవసాయంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో ఎస్ఆర్ఐఈ ఇన్ఫ్రా మెళకువలు నేర్పనుంది.
ఇదిలాఉండగా….మరికొన్ని సంస్థలతో మంత్రి కేటీఆర్ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, తెలంగాణ పారిశ్రామిక విధానం గురించి కేటీఆర్ వివరించారు. ఇదిలాఉండగా…మరి కొద్దిసేపట్లో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ విధానాన్ని కేంద్ర మంత్రితో కలిసి మంత్రి కేటీఆర్ విడుదల చేయనున్నారు.
https://twitter.com/MinIT_Telangana/status/926716533908361216
Post Views: 234