ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే అప్పుడే పలు పార్టీలకు చెందిన నేతలు తాము పోటి చేయబోయే సెగ్మెంట్లను ఖరారు చేసుకునే పనిలో పడ్డారు .అందులో భాగంగా గెలవగల సత్తా ఉండి సీట్లు రాని అధికార మిత్రపక్షాలైన టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ లో చేరడానికి సిద్ధమవుతున్నారు .
ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తోలి సార్వత్రిక ఎన్నికల్లో కడపజిల్లా లోని రాజంపేట నియోజక వర్గం నుండి ఎంపీగా పోటి చేసి ప్రస్తుత వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చేతిలో ఓడిపోయిన మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి త్వరలోనే బీజేపీపార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరనున్నారు అని వార్తలు వస్తున్నాయి .ఐతే రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆమెకు ఆ సీటు కూడా దక్కే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం ఆ నియోజకవర్గం వేరేవారికి సొంతం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
టీడీపీ దానికోసం ఆశలు పెట్టుకోకపోయిన బీజేపీలో ఆ సీటుకోసం ఆమెకు పోటీ తప్పేలా లేదు. మొన్నటిదాకా ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు సహాయకుడిగా ఉన్న సత్య, ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చి, పార్టీలో చేరారు.ఆయన రాజంపేట ఎంపీ స్థానంనుంచి బరిలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు. తనకు అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయనేది ఆయన వాదన. పైగా ఆయన ఆ నియోజకవర్గానికి స్థానికుడు. ఆ రకంగా ఆయన టికెట్ రేసులో పైచేయి సాధిస్తే రాజంపేట అభ్యర్థి అవుతారు. దీంతో తన రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న పురందేశ్వరి త్వరలోనే వైసీపీ గూటికి చేరనున్నారు అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి .