తెలంగాణ ప్రజల కలలు, ఆకాంక్షలు ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.
Dreams & Aspirations of Telangana people being realised one by one. Jai Telangana !! https://t.co/4Jr3bqkupN
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 4, 2017
జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నవాబుపేటలో నిర్మించిన రిజర్వాయర్ నుంచి నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు గోదావరి జలాలను విడుదల చేసిన విషయం విదితమే. నవాబుపేటలో గోదావరి జలాల విడుదలకు సంబంధించిన ఫోటోలను తన ట్విట్టర్ పేజీలో పోస్టు చేశారు కవిత. రాష్ర్ట ప్రభుత్వం.. పేద, మధ్య తరగతి ప్రజల కలలు, ఆకాంక్షలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది. నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్స్, వృద్ధులు, వింతతువులు, వికలాంగులకు ఆసరా పింఛన్లు, గర్భిణీలకు కేసీఆర్ కిట్స్, రైతులకు ఎకరానికి రూ. 4 వేల చొప్పున పెట్టుబడి, ఉచిత 24 గంటల కరెంట్, షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ పథకం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు గురుకుల పాఠశాలలు, అంగన్ వాడీ టీచర్లకు, హెల్పర్లకు జీతాల పెంపు, రైతుల సంక్షేమమే ధ్యేయంగా రైతు సమన్వయ సమితిల ఏర్పాటు వంటి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుంది.
కోటి ఎకరాలను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నది. ఉత్తర తెలంగాణ వర ప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని శాసనసభ వేదికగా నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. ఇక పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతాంగానికి సాగునీటిని అందిస్తుంది ప్రభుత్వం. చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించేందుకు ప్రభుత్వం సంకల్పించింది.కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి కేంద్రం నుంచి ఆమోదాల పరంపర కొనసాగుతున్నది. మొన్న అటవీ భూములకు తొలిదశ అనుమతులు, నిన్న హైడ్రాలజీ క్లియరెన్స్ ఇవ్వగా.. తాజాగా అంతర్రాష్ట్ర కోణంలోనూ కేంద్ర జలసంఘం పచ్చజెండా ఊపింది.