టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ తాజా చిత్రం ఉన్నది ఒకటే జిందగీ విడుదల అయ్యి మిశ్రమ స్పందనతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా వెనుకబడింది. అయితే ఉన్నది ఒకటే జిందగీ సినిమా రిలీజ్ కు ముందే ఓ వివాదంలో చిక్కుకుంది. నిర్మాత బెల్లంకొండ సురేష్ రామ్‌తో సినిమా తీద్దామని భావించి అతడికి అడ్వాన్స్ ఇచ్చాడట.
ఎన్నాళ్లయినా సినిమా చేయకపోవడంతో తన డబ్బు తనకు తిరిగి ఇచ్చేయమంటూ ఉన్నది ఒకటే జిందగీ రిలీజ్ కు ముందు గట్టిగా అడిగాడంట. ఉన్నది ఒకటే జిందగీ మాస్టర్ కాపీ తనవద్ద ఉందని.. తన డబ్బు తనకు ఇవ్వకపోతే దానిని నెట్ లో పెట్టేస్తానని ఆ సినిమా నిర్మాత.. రామ్ పెదనాన్న అయిన స్రవంతి రవికిశోర్ ను బెదిరించి డబ్బు వసూలు చేశాడనే న్యూస్ బయటకు వచ్చింది.
అయితే ఇప్పటివరకు ఈ వ్యవహారంపై స్రవంతి రవికిశోర్ – బెల్లంకొండ సురేష్ ఎక్కడా పబ్లిక్ గా ఎలాంటి కామెంట్లు చేయలేదు. బెల్లంకొండ తీరుతో బాధపడిన రవికిశోర్ దీనిపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో కంప్లయింట్ చేశాడని తెలుస్తోంది. దీనిపై వీళ్లిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడేందుకు ఫిలిం ఛాంబర్ రెడీ అయింది. బెల్లంకొండ సురేష్ – స్రవంతి రవికిశోర్ ల మధ్య చాలా కాలం నుంచి భేదాభిప్రాయాలు ఉన్నాయి.
అయితే దానిని సెటిల్ చేసుకోవడానికి ట్రై చేసిన పద్దతి ఏమాత్రం బాగోలేదు. ఈ తరహా సెటిల్ మెంట్ ఇండస్ట్రీకి ఎంతమాత్రమూ మంచిది కాదని ఫిలిం ఛాంబర్ లోని సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. వాళ్లిద్దరితో మాట్లాడిన తర్వాత ఏ విషయమైనా మాట్లాడగలమని ఛాంబర్ ప్రెసిడెంట్ జెమినీ కిరణ్ అంటున్నారు.
బెల్లంకొండ సురేష్ తాను తలుచుకుంటే ఎంత స్టార్ సినిమా మాస్టర్ కాపీ కావాలన్నా సంపాదించగలనని తనతో సవాల్ విసరడంతో స్రవంతి రవికిశోర్ ఛాంబర్‌లో కంప్లయింట్ చేశాడు. నిజంగ బెల్లంకొండ అంత మాటన్నాడా.. మాస్టర్ కాపీ సంపాదించడం అంత సులభమా అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా ఉంది. వీళ్లిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి ఛాంబర్ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో.. లేక వీళ్ల విభేదాలు ఏ స్థాయికి వెళతాయో అన్నదాని పై సినీ వర్గాల్లో ఆశక్తినెలకొంది.