జైలు శిక్ష నుంచి తప్పించుకునేందుకు ఓ వేశ్య ఏకంగా కండోమ్‍నే మింగేసింది. దీంతో ఆమె అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైంది. ఈ ఘటన తైవాన్ దేశంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. హెల్త్ స్పా పేరుతో వ్యభిచారం చేస్తున్న డాంగ్ అనే 48 ఏళ్ల మహిళ తన వద్దకు వచ్చిన విటుడితో కలిసి వుండగా ఉన్నట్టుండి పోలీసులు రైడింగ్ చేశారు. అనుకోని పరిణామానికి ఏం చేయాలో తెలియక.. ఆ వేశ్య వెంటనే విటుడి పురుషాంగానికి వున్న కండోమ్ తీసి గుటుక్కున మింగేసింది. దీంతో ఆధారాలేమీ దొరకవని ఆమె భావించింది
అయితే, పోలీసుల రైడింగ్‌లో ఆమెతోపాటే దొరికిపోయిన విటుడు మాత్రం పోలీసుల ముందు నిజాన్ని అంగీకరించాడు. తాము శృంగారం మధ్యలో వుండగా వచ్చారంటూ.. పోలీసులకు జరిగిన విషయాన్ని తెలిపాడు. దీంతో ఆ గదిలో వాళ్లు వాడిపడేసిన కండోమ్ కోసం మొత్తం అన్వేషించిన పోలీసులకు ఎటువంటి ఆధారం చిక్కలేదు. అనుమానం వచ్చిందిలా.. కాగా, పోలీసుల విచారణ జరుగుతుండగానే ఆమె పదేపదే తాగునీరు అడుగుతుండటంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమెని ఆస్పత్రికి తీసుకెళ్లి స్కానింగ్ చేయించగా అసలు విషయం బయటపడింది.
ఆ వేశ్య ఛాతి భాగంలో కండోమ్ లాంటి ఆకారంలో వున్న ఓ వస్తువును గుర్తించిన పోలీసులకి అసలు విషయం అర్థమైపోయింది. తాను తప్పు చేశాననే ఆధారాలని కనుమరుగు చేసేందుకే నిందితురాలి ఈ పని చేసినట్లు గుర్తించారు. వైద్య చికిత్స పూర్తయిన తర్వాత ఆమెను అదుపులోకి తీసునేందుకు సిద్ధంగా ఉన్నారు.