బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఆరోపణలపై ఇండిగో వైమానిక సంస్థ యాజమాన్యం స్పందించింది. పీవీ సింధు అధిక లగేజీతో ప్రయాణానికి సిద్ధమయ్యారని ఆ సంస్థ పేర్కొంది. లగేజీని కార్గోలోకి తరలించేందుకు ఆమె అంగీకరించలేదని తెలిపింది. చాలా సార్లు కోరిన తర్వాత లగేజీని కార్గోలోకి తరలించేందుకు అంగీకరించారని పేర్కొంది.
అంతకు ముందు ఇండిగో సిబ్బంది ఒకరు తనతో అమర్యాదకరంగా ప్రవర్తించినట్లు పీవీ సింధు ఆరోపించారు. అటువంటి వ్యక్తి ఉద్యోగిగా ఉంటే ఇండిగో పేరు దెబ్బతింటుందని ఆమె ట్వీట్ చేశారు.
