విద్యాలయాలు కావు విద్యార్దుల పాలిట మృత్యు గుహలు..జైళ్లలాంటి వాతావరణం,జైలర్స్ లా ఉపాధ్యాయులు,ఖైదీల్లా విధ్యార్దులు ..బయటికి చెప్పుకోలేక,తల్లిదండ్రులకు నచ్చినట్టు చదవలేక నరకం అనుభవిస్తూ గత నెలలోనే పదుల సంఖ్యలో ఆత్మహత్యలు ..ఏడాదిలో వందమందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇంత జరుగుతున్నా ,ఇంత మంది పిల్లలు చనిపోతున్నా అటు విద్యార్దుల అమ్మానాన్నల్లో కానీ,యాజమాన్యంలో కానీ ఎలాంటి మార్పు లేదు..సరికొత్తగా మరో వివాదం..నారయణ విధ్యాసంస్థలకు చెందిన ఒక ఆడియో టేపు బయటపడింది.ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఆ విద్యాసంస్థల్లో జరుగుతున్న అక్రమాలను బయటపెట్టే ఆడియో అది.ఇంతకీ అందులో ఏముందో తెలుసా..?
హైదరాబాద్ రామాంతపూర్‌లోని నారాయణ స్కూల్‌కు చెందిన వైస్ ప్రిన్సిపల్ నవీన్ .. అదే బ్రాంచ్‌కు చెందిన ప్రిన్సిపాల్ సరితా అగర్వాల్‌తో మాట్లాడిన మాటలు ఈ ఆడియోలో ఉన్నాయి.. డీమానిటైజేషన్ సమయంలో బ్లాక్‌మనీని నారాయణ యాజమాన్యం వైట్‌మనీగా ఎలా మార్చిందో వీరిద్దరూ ఆ వీడియోలో చర్చించుకున్నారు. అంతేకాదు యాజమాన్యంలోని కీలక వ్యక్తికి మహిళలతో వివాహేతర సంబంధం ఉన్నట్లు.. హయత్‌నగర్ నారాయణ బ్రాంచ్‌కు చెందిన ఉద్యోగి శ్రీలత ఆత్మహత్యకు కారణం ఏంటో కూడా..ఈ ఆడియోలో చెప్పడం సంచలనంగా మారుతోంది.వనస్థలీపురంలో ఉన్న నారాయణ విద్యాసంస్థల గెస్ట్‌హౌస్ అరాచకాలకు అడ్డాగా మారిందని.ఈ ఆడియో ద్వారా తెలుస్తోంది. నారాయణ సంస్థలకు సంబంధించిన కీలకమైన విషయాలపై చర్చ జరిగిన ఈ ఆడియో టేపు…ఇప్పుడు వైరల్ అవుతోంది.అయితే ఈ ఆడియో టేప్ సంభాషణలు నిజం కాదని నారాయణ సంస్థల ప్రతినిధి ఒకరు స్పందించారు తప్ప..ఇప్పటీవరకూ అటు విధ్యార్దుల ఆత్మహత్యల పట్ల కానీ..ఇప్పుడు ఈ ఆడియో టేప్ గురించి కానీ నారాయణ స్పందించలేదు.
ఒకవైపు విద్యార్దుల ఆత్మహత్యలు ,మరోవైపు బహిరంగంగానే శ్రీచైతన్య,నారాయణ విద్యాసంస్థలు ఒకరినోకరు దూషించుకోవడం..ఇప్పుడు ఈ ఆడియో టేపు.పరిస్థితులను కళ్లకట్టినట్టు చూపిస్తున్నప్పటికీ తల్లిదండ్రుల్లో మార్పు రావట్లేదు.అటు అధికారులు ,కానీ నాయకులు కానీ స్పందించడంలేదు..చదువుకునే స్థాయినుండి చదువు కొనే స్థాయి కి ఎదిగాం తప్ప..అందులో మన ఉనికిని మనమే కోల్పోతున్నాం.
