Minister for IT, @KTRTRS participated in Telangana Food Processing Policy ceremony at World Food India 2017 event, Delhi. pic.twitter.com/jH1uuqCbFs
— Min IT, Telangana (@MinIT_Telangana) November 4, 2017
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కెటి. రామారావు తెలంగాణ ఫుడ్ ప్రొసెసింగ్ పాలసీని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో అవిష్కారించారు. ఢిల్లీలో జరుగుతున్న వరల్డ్ ఫుడ్ ఇండియా – 2017 లో ఈ పాలసీని ఆవిష్కరించారు. తెలంగాణలో ఉన్న విస్తృతమైన ఫుడ్ ప్రొసెసింగ్ రంగంలోని అవకాశాలను అందిపుచ్చుకునేలా ఈ పాలసీ దోహదం చేస్తుందని మంత్రి తెలిపారు. ఈ పాలసీలోని ముఖ్యంశాలు ఇవి..
పాలసీ ముఖ్యాంశాలు
ఈ పాలసీ వచ్చే ఐదేళ్లు అమలులో ఉంటుంది
రాబోయే ఐదేళ్లలో 20 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలోకి వస్తాయి
లక్షా 25 వేల ప్రత్యక్ష ఉద్యోగాలు
రైతుల ఆదాయం ఐదేళ్లలో రెట్టింపు
ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గొర్రెలు, చేపల పెంపకం వంటి కార్యక్రమాలను ఫుడ్ ప్రొసెసింగ్ పరిశ్రమతో అనుసంధానం
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వ్యవసాయ – ఆహార ఉత్పత్తుల వాల్యూ చైన్ ఏర్పాటు
ఇందుకోసం ఫుడ్ ప్రొసెసింగ్ క్లస్టర్లు, ఫుడ్ పార్క్ ల అభివృద్ధి
సగటు ఫుడ్ ప్రొసెసింగ్ స్థాయిని కనీసం 20 శాతం పెంచడం
జాతీయ స్థాయిలో నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తుల కేంద్రంగా తెలంగాణను మార్చడం
ఈ పాలసీలో భాగంగా స్టార్ట్ అ ప్స్ కోసం అగ్రి టెక్ నిధి ఏర్పాటు
ఫుడ్ ప్రొసెసింగ్ రంగంలో ఇన్నోవేషన్ మరియు, ఆదర్శ విధానాల ప్రమోషన్
మరోవైపు వరల్డ్ ఫుడ్ ఇండియా 2017లో రెండో రోజు పలు సంస్థలతో అవగాహనా ఒప్పందాలను తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకున్నది. సుమారు 1250 కోట్ల రూపాయల విలువైన 9 ఒప్పందాలను కుదుర్చుకున్నది. మంత్రి కేటీఆర్ సమక్షంలో ప్రభుత్వం తరపున పరిశ్రమల శాఖా కార్యదర్శి జయేశ్ రంజాన్ ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీల్లో బికానీర్ వాలా, ప్రయాగ్ న్యూట్రీ మేన్స్ ఫుడ్స్, కనోరియ గ్రూప్ కు చెందిన అన్నపూర్ణ ఫుడ్స్, కరాచీ బెకరీ, బ్లూ క్రాఫ్ట్ ఆగ్రో, సంప్రీ గ్రూప్, క్రీం లైన్ డైరీ, పుష్య ఫుడ్స్ సంస్థలున్నాయి. ఈ ఒప్పందాల ద్వారా సుమారు 3800 మందికి నేరుగా ఉద్యోగావకాశాలు, మరో 20 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించే అవకాశాలున్నాయి. నిన్న ఈరోజు కుదుర్చుకున్న ఒప్పందాలతో మెత్తం 10 వేల మందికి ప్రత్యక్ష ఉపాది లభిస్తుందన్నారు. దీంతోపాటు 45 వేల మంది రైతులకు వ్యవసాయంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో మెళకువలు నేర్పనున్నారు. వీటీతోపాటు మరికొన్ని సంస్థలతో మంత్రి చర్చలు జరిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, తెలంగాణ పారిశ్రామిక విధానం గురించి వివరించారు.