తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పవిత్ర పుణ్యక్షేత్రమైన జహంగీర్ పీర్ దర్గాకు త్వరలో వస్తున్నారు.అందులో భాగంగా ఈనెల 10వ తేదీన సీఎం దర్గాలో 51 యాటల ద్వారా న్యాజ్ (కందూరు)మొక్కును చెల్లిస్తున్నారు.ప్రత్యేక ప్రార్ధనల ఏర్పాట్ల పరిశీలన కోసం రేపు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తొ పాటు మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి దర్గాకు వస్తున్నట్టు వక్ఫ్ అధికారులు తెలిపారు ఈరోజు శనివారం నాడు రంగారెడ్డి జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి రత్నమాల,వక్ఫ్ బోర్డ్ సెక్రెటరీ ఖాసిం తొ పాటు స్థానిక అధికారులు దర్గాలొ ఏర్పాట్ల కోసం పర్యటీంచారు.స్థానిక నేతలు యాదగిరి తదితరులు వారి వెంట ఉన్నారు
