ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా ప్రస్తుతం డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సాంబశివరావును కొనసాగించాలని బాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన జాబితాను యూపీఎస్సీ వెనక్కి పంపింది. దీంతో రెండోసారి సాంబశివరావు పేరును ప్రభుత్వం సూచించనుంది.గతేడాది జులైలో రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సాంబశివరావు 1984వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి.రానున్న డిసెంబర్‌లో ఆయన పదవీవిరమణ పొందనున్నారు.
