హ్యాట్రిక్ హిట్‌తో దూసుకుపోతున్న ఎన్టీఆర్ జై లవ కుశ తో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. బాబి దర్శకత్వంలో బాబి తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన సినిమా రూ.125 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్న మూవీ ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది.
అయితే, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వెళ్లడానికి చాలా సమయం పట్టేలా ఉందని ఫిల్మ్‌నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. కారణం, త్రివిక్రమ్ ప్రస్తుతం చేస్తున్న పవన్ కల్యాన్ సినిమానే. దీనిపై డైరెక్టర్ కాన్సట్రేషన్ పెట్టినట్లు సమాచారం.
అయితే, పవన్ కల్యాణ్ హీరోగా, త్రివిక్రమ్ డైరెక్టర్‌గా వచ్చిన జల్సా, అత్తారంటికి దారేది సినిమాలు సూపర్‌హిట్ అయిన విషయం తెలిసిందే. మూడో సినిమా అంతకు మించి హిట్ కావాలని శ్రమిస్తున్నారు. ఈ చిత్ర ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉండనున్నారు.
ఆ తరువాత ఎన్టీఆర్ స్ర్కిప్ట్ వర్క్‌లో పడనున్నారు. అందుకోసం రెండు నెలలు కేటాయించనున్నారు. దీంతో ఎన్టీఆర్ 28వ మూవీ మార్చిలోనే సెట్స్‌మీదకు వెళుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హారికా అండ్ హాసిని బ్యానర్‌లో రాథాకృష్ణ నిర్మించనున్న ఈ మూవీపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు.