బుల్లితెర యాంకర్‌గా ఓ ఊపు ఊపుతున్న అనసూయ ఇప్పుడు మంచి పాపులర్ అయ్యింది. జబర్దస్త్ షో తో అఖిలాంద్ర ప్రేక్షకులను అలరించిన ఈ సుందరి ఏం చేసినా సెన్సేషన్. ప్రజెంట్ గంటకు లక్ష రూపాయలు చొప్పున టీవీ షోస్ చేస్తోన్న ఈ సుందరి ప్రతి సినిమా ఫంక్షన్‌కు హాజరై పబ్లిసిటీ పెంచుకుంటుంది.
అంతేకాదు…
ఇప్పటివరకూ సినిమాలను కాస్త లైట్ తీసుకున్న అనసూయ ఇప్పుడు వరుస చిత్రాలతో బిజీ అవుతోంది. తెలుగుతో పాటు పలు భాషల్లోనూ అనసూయ సినిమాలను చేస్తోంది. నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాతో బిగ్ స్క్రీన్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్ బ్యూటీ ఆ తర్వాత ‘క్షణం’ చిత్రంలో ఫుల్ లెన్త్ రోల్‌తో మెప్పించింది. ఈ సంవత్సరం ‘విన్నర్’లో సాయిధరమ్ తేజ్‌తో చిందేసిన ఈ బ్యూటీ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతోంది. ఇప్పటికే రామ్‌చరణ్ ‘రంగస్థలం’లో కీలక పాత్రలో కనిపిస్తోన్న అనసూయ మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లోనూ నటించే ఛాన్స్ కొట్టేసింది.
సీనియర్ హీరో మోహన్ బాబు ‘గాయత్రి’ చిత్రంలోనూ.. జర్నలిస్ట్ పాత్రలో నటిస్తోందట అనసూయ. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కాలా’ సినిమాలోనూ నటించే ఆఫర్ కొట్టేసిందట అనసూయ. ఇలా తెలుగు, తమిళంలోనే కాదు కన్నడలోనూ స్టార్ హీరో దర్శన్ నటిస్తోన్న పౌరాణిక చిత్రం ‘మునిరత్న కురుక్షేత్ర’లో కూడా అనసూయ ఓ ముఖ్యపాత్రలో కనిపించనుందట. మొత్తంమీద ప్రస్తుతం అరడజను చిత్రాలతో అలరించడానికి సిద్ధమవుతోంది ఈ హాట్ యాంకర్.
కాగా, ఇప్పటికే యూత్ ఫాలోయింగ్ ఉన్న అనసూయ.. గత గురువారం జరిగిన జబర్దస్త్ షోతో మళ్లీ యూత్‌ను హీటెక్కించింది అనసూయ. ఓ పక్క తన చిట్టి పొట్టి డ్రస్సులతోను.. మరో పక్క హాట్ లుక్స్‌తోనూ తన అందాలను ఒలకబోసిన అనసూయ అంతకు మించిన మూమెంట్స్‌తో జబర్దస్త్ షోలో డ్యాన్స్ చేయడంతో యూత్ తెగ అట్రాక్ట్ అయ్యారు. దీంతో అనసూయ తన డ్రస్ సైజును మళ్లీ తగ్గించిందంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు.