ఇటీవల డెన్మార్క్, ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్‌లను సొంతం చేసుకున్న భారత షట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌ను గవర్నర్ నరసింహన్ అభినందించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ దంపతులను కిదాంబి శ్రీకాంత్‌తో పాటు మరో క్రీడాకారుడు హెచ్.ఎస్. ప్రణయ్ కలిశారు. రెండు, 11 ర్యాంకులు సాధించుకున్న శ్రీకాంత్, ప్రణయ్‌లను గవర్నర్ దంపతులు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న శ్రీకాంత్ ప్రపంచ నంబర్ వన్ స్థానానికి చేరుకోవాలని గవర్నర్ ఆకాంక్షించారు. బ్యాడ్మింటన్‌లో సాధిస్తున్న విజయాలు దేశానికి గర్వకారణమన్నారు. ప్రస్తుతం బ్యాడ్మింటన్‌లో భారత్ జైత్ర యాత్ర కొనసాగుతోందని గవర్నర్ వ్యాఖ్యానించారు. మరిన్ని గొప్ప విజయాలతో దేశ కీర్తిని ప్రపంచానికి చాటాలన్నారు.
