ఏపీలో రైతులు అంటే ఎంత చిన్న చూపో ఈ సంఘటన బట్టి అర్ధమవుతుంది .రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీ రైతుల కోసం రుణ మాఫీ ,వడ్డీ లేని రుణాలను మంజూరు చేస్తాం లాంటి హామీలను కురిపించి ఓట్లు వేయించుకొని మరి అధికారంలోకి వచ్చింది .తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ సర్కారు రైతులకిచ్చిన హామీలను తుంగలో తొక్కింది .తాజాగా ఆయన రాష్ట్రానికి వ్యవసాయశాఖ మంత్రి.
రైతులతో మమేకమై వారి కష్టనష్టాలు తెలుసుకోవాల్సిన ప్రజాప్రతినిధి. కానీ పొలంలో మట్టిపై నడిచేందుకు కూడా ఆయన ఇష్టపడలేదు. ఏకంగా పొలంలో గ్రీన్ కార్పెట్ వేయించుకుని దానిపై నడుస్తూ పంటను పరిశీలించారు. ఆయన ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి. రాష్ట్రంలో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో పత్తిపంటలను పరిశీలించేందుకు సోమిరెడ్డి వెళ్లారు. సమస్యలు చెప్పాలని ఒక రైతును అడిగారు. తీరా సదరు రైతు తన సమస్యలు చెబుతుంటే…. రైతులా మాట్లాడు…. రెబల్‌లా కాదంటూ రుసరుసలాడారు.
దీంతో సదరు రైతు భయపడి సైలెంట్ అయిపోయారు. మంత్రి వస్తున్నారని తెలుసుకున్న అధికారులు స్వామి భక్తి చాటుకునేందుకే ఏకంగా పత్తిపంటలో కార్పెట్ పరిచారు. మంత్రి కూడా పొలంలో కార్పెట్ ఏంటని ప్రశ్నించకుండా దానిపై తిరుగుతూ పంటలను పరిశీలించారు.ఈ క్రమంలో గులాబీ పురుగు పంటను నాశనం చేస్తోందని…. ఏ వ్యవసాయ శాస్త్రవేత్త కూడా తమ వద్దకు వచ్చి సలహాలు ఇవ్వడం లేదని రైతులు మంత్రి దృష్టికి తెచ్చారు. కనీస మద్దతు ధర దక్కడం లేదు. నకిలీ పత్తివిత్తనాలతో తీవ్రంగా నష్టపోతున్నామని మంత్రికి వివరించారు .అయితే పొలంలో గ్రీన్ కార్పైట్ వేయించుకొని మరి నడిచిన సోమిరెడ్డి పై పలువురు విమర్శలతో విరుచుకుపడుతున్నారు