ప్రముఖ గాయని సుశీల మరణించారనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఈ వార్త విని ఒక్కసారిగా షాక్ తిన్న సుశీల..నేను సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉన్నానని.. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నానని త్వరలోనే ఇండియాకి తిరిగి వస్తున్నానని చెప్పారు. సోషల్ మీడియాలో నా మరణ వార్త పై వస్తోన్న వార్తలను వెంటనే ఆపేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇకపోతే గురువారం రాత్రి గాయని సుశీల మరణించినట్లు వార్తలు రావడమే కాకుండా పలువురు ఆమె మృతి కి సంతాపం కూడా తెలియ జేస్తుండటంతో ఈ వార్తలు అమెరికాలో ఉన్న సుశీల చెవిన పడ్డాయి దాంతో ఖంగుతిన్న సుశీల ఓ వీడియో బైట్‌ని పంపించింది . 81 ఏళ్ల వయసున్న పి. సుశీల భారతీయ చలనచిత్ర చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించింది .
ఇక అన్ని భాషలలో పాటలు పాడిన సుశీల గతకొంత కాలంగా పాటలు పాడటం తగ్గించింది. అయితే ప్రస్తుతం పాటల కచేరి నిమిత్తమే అమెరికా వెళ్ళింది, దాంతో ఈ పుకార్లు షికారు చేసాయి . మొత్తానికి కొంతమంది అత్యుత్సాహం ఎలా ఉన్నప్పటికీ మధుర గాయని సుశీల ఆరోగ్యంగా ఉండటం సంతోషించతగ్గ విషయం . ఆమె మరిన్ని కాలాల పాటు చల్లగా ఉండాలని ఉండాలని సర్వత్రా ఆకాక్షిస్తున్నారు.