టీమ్‌ఇండియా స్టార్ ఆటగాడు చతేశ్వర్ పుజారా తనకే సాధ్యమైన అరుదైన రికార్డును బద్దలుకొట్టాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యధిక ద్విశతకాలు సాధించిన టీంఇండియా క్రికెటర్‌గా విజయ్ మర్చంట్ పేరిటున్న రికార్డును పూజారా తిరగరాశాడు.
జార్ఖండ్‌తో మ్యాచ్‌లో డబుల్ సెంచరీ బాదిన అతడు కెరీర్లో 12వ ద్విశతకాన్ని నమోదు చేశాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న దిగ్గజ క్రికెటర్ విజయ్ మర్చంట్ (11)ను రెండో స్థానానికి పరిమితం చేశాడు.
స్టార్ ఆటగాళ్ళు సునీల్ గావస్కర్, విజయ్ హజారే, రాహుల్ ద్రవిడ్‌లు పదేసి డబుల్ సెంచరీలతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. విశేషమేంటంటే.. వీరిలో మూడు ట్రిపుల్ శతకాలు బాదిన ఏకైక ఆటగాడు పుజారానే. రవీంద్ర జడేజా మాత్రమే అతడితో సమానంగా మూడు త్రిశతకాలు కొట్టాడు.