తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని తార్నాక డివిజన్ పరిధిలో నడుస్తున్న పలు అభివృద్ధి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తీ చేయాలని తార్నాక డివిజన్ కార్పొరేటర్ అలకుంట సరస్వతీ అన్నారు.ఈ రోజు శుక్రవారం తార్నాకలో స్ర్టీట్ నంబర్ 11 లో రూ. 7 లక్షల వ్యయంతో నిర్మించతలపెట్టిన డ్రైనేజీ, వర్షం నీటి గుంతల మరమ్మతుల పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ అలకుంట సరస్వతి మాట్లాడుతూ డివిజన్ లో ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న పనులను వెంటనే పూర్తి చేశేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్భందులు లేకుండా ఉండేందుకు మంత్రి పద్మారావు గారి సహాకారంతో డివిజన్ ను మరింత అభివృద్ది చేశే దిశగా తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం గ్రేటర్ అధ్యక్షుడు అలకుంట హరి, నాయకులు సునీల్ ముదిరాజ్, నాగేష్ గౌడ్, వార్డు మెంబర్ యాదగిరి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.