టాలీవుడ్ సినీ సర్కిల్లో ఓ సంచలన వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి తన 152వ చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్నారు. ఈ చిత్రంలో చిరు సోదరుడు.. పవన్ కల్యాణ్ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం.
ఇందులో పవన్ పాత్ర అరగంట పాటు ఉంటుందని తెలుస్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కనుంది. 2007లో చిరు హీరోగా చేసిన శంకర్‌దాదా జిందాబాద్ సినిమాలో గెస్ట్గోల్లో మెరిసిన పవన్.. త్రివిక్రమ్- చిరు కాంబో మూవీలో ఎక్కువ సేపే కనిపించనున్నాడట. సుమారు అరగంట పాటు పవన్ కల్యాణ్ గెస్ట్ రోల్ ఉంటుందని చెప్పుకుంటున్నారు.
ఈ వార్త విని తమ అభిమాన హీరోలిద్దరినీ ఒకేసారి సిల్వర్‌స్క్రీన్‌పై చూడొచ్చని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్టులో పవన్ గెస్ట్ రోల్‌కు సంబంధించి మెగా కాంపౌండ్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం చిరు తన 151వ చిత్రం సైరా నరసింహారెడ్డిలో నటిస్తుండగా.. మరోపక్క పవన్‌కల్యాణ్- త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ చిత్రం సిద్ధమవుతోంది