తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలో చేరతారని గత కొంతకాలంగా వార్తలు హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై ఎట్టకేలకు ఎమ్మెల్యే సురేఖ స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఆమె ఈ రోజు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చచ్చిపోయిందని పేర్కొన్నారు.
పార్టీ మారే ప్రసక్తే లేదని.. అదంతా అసత్య ప్రచారమని కొండా దంపతులు కొట్టిపారేశారు. గత కొంతకాలంగా తాము పార్టీ మారతామనే వస్తున్నా ప్రచారం రాజకీయ కుట్రేనని ఆమె చెప్పారు.ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ పునర్జన్మ ఇచ్చారని ఈ సందర్భంగా కొండా దంపతులు మీడియాకు వివరించారు.కొందరు కాంగ్రెస్ నేతలు కావాలనే మైండ్‌గేమ్ ఆడుతున్నారని కొండా దంపతులు మండిపడ్డారు.
అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో మాకు రాజకీయ జన్మనిచ్చింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్.. పునర్జన్మనిచ్చింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆమె వ్యాఖ్యానించారు. పార్టీ మారే ప్రసక్తే లేదు.. కడదాకా టీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని ఆమె తేల్చిచెప్పారు.