ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కు ఎంతగా అభిమానమో మన అందరికి విదితమే .గత మూడున్నర ఏండ్లుగా ఉండవల్లి ప్రత్యేక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న కానీ నిత్యం బాబు సర్కారు అవినీతి ,అక్రమాలపై నిరంతరం ఆయన మీడియా ముందు ఎండగడుతూ వస్తు ఉన్నాడు .
తాజాగా ఉండవల్లి కి జగన్ మీద కోపం వచ్చింది .అదే ఈ నెల 10 నుండి జరగనున్న ఏపీ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ప్రజాప్రతినిధులు హాజరుకాకూడదంటూ ఆ పార్టీ అధినేత జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఉండవల్లి తప్పుబట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ శ్రేణులు త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలన్న నిర్ణయం ముమ్మాటికీ తప్పేనని ఆయన అన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో బాబు సర్కారు అవినీతి అక్రమాలపై ,గత మూడున్నర ఏండ్లుగా కదలని పోలవరం ప్రాజెక్టు అంశంతో పాటు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని… వీటన్నిటిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత ప్రతిపక్షంపైనే ఉందని ఉండవల్లి అన్నారు. అయితే ఇదే సమయంలో, జగన్ చేపట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని ఉండవల్లి కోరడం విశేషం ..