టాలీవుడ్ హీరో డాక్టర్ రాజశేఖర్ నటించిన తాజా చిత్రం గరుడవేగ ఈ శుక్రవారమే ప్రక్షకుల ముందుకు వచ్చింది. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పై భారీ అంచనాలే ఉన్నాయి. రాజ శేఖర్ చాలా గ్యాప్ తర్వాత హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి షోకి పాజిటీవ్ టాక్స్ వచ్చాయి. ఈ చిత్రతో రాజశేఖర్ మళ్ళీ ఫాంలోకి వచ్చాడని సర్వత్రా చర్చించుకుంటున్నారు.
అయితే ఈ మూవీ విడుదలకు ముందు రాజశేఖర్ దంపతులు చిరంజీవిని పర్సనల్ గా కలవడం ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాక, సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్‌గామారింది. ఒకప్పుడు మెగా ఫ్యామిలీని విమర్శించిన రాజశేఖర్ దంపతులు, ఇప్పుడు చిరంజీవిని ఎందుకు కలిసారో అంటూ విచిత్రంగా మాట్లాడుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే చిరంజీవి ఇంటికి వెళ్లిన రాజశేఖర్ అక్కడ చేసిన పనిని చూసి షాక్ అవుతున్నారు. తన లాప్ టాప్ ఓపెన్ చేసి చిరంజీవికి గరుడ వేగ సినిమా చూపించారని సమాచారం. ఈ విషయం బయటకి రావడంతో నెటిజన్స్ ప్రజలు పైరసీ చూస్తే ఫైర్ అయ్యే హీరోలు తమంతట తామే ఇలా సినిమాని పైరసీలో చూపిస్తే తప్పు కాదా అని విమర్శిస్తున్నారు.