Home / MOVIES / గరుడవేగ.. ప్రివ్యూ చూసి ఇచ్చిన జెన్యూన్ షార్ట్‌ రివ్యూ..!

గరుడవేగ.. ప్రివ్యూ చూసి ఇచ్చిన జెన్యూన్ షార్ట్‌ రివ్యూ..!

ప్ర‌ముఖ హీరో రాజ‌శేఖ‌ర్ యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా తనకంటూ ప్రత్యేక బ్రాండ్‌ను ఏర్పరుచుకున్నారు. ఒకప్పుడు వరుస హిట్లతో దూసుకుపోయిన ఈ హీరో తరవాత విజయానికి దూరమైపోయారు. సొంతంగా సినిమాలు నిర్మించి చేతులు కాల్చుకున్నారు. ఇక రాజశేఖర్ పనైపోయింది అనుకుంటున్న సమయంలో పిఎస్‌వి గరుడవేగ అంటూ మరో ప్రయోగానికి తెరలేపారు. రాజ‌శేఖ‌ర్ కెరీర్‌లోనే అత్య‌ధికంగా రూ.30 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే మంచి హైప్ తెచ్చుకుంది.

టీజ‌ర్‌, ట్రైల‌ర్ల‌తో ఆక‌ర్షించిన ఈ సినిమా ఈ శుక్ర‌వారం వ‌ర‌ల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. సినిమాలో అదిరిపోయే యాక్ష‌న్ ఎపిసోడ్స్‌, స‌న్నిలీయోన్ ఐటెం సాంగ్ ఈ సినిమాకు హైలెట్స్‌గా నిలిచాయి. చంద‌మామ క‌థ‌లు, గుంటూర్ టాకీస్ చిత్రాల ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తార్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మరి ఈ సినిమా రాజశేఖర్‌ను గట్టెక్కించిందా.. హిట్ కోసం ముఖం వాసిపోయి ఉన్న రాజ‌శేక‌ర్‌కు విజ‌యాన్ని అందించిదా అంటే అవున‌నే అంటున్నారు.

ఇక సినిమా గురించి చెప్పాలంటే.. ఈ సినిమా ఫస్టాప్‌ను దర్శకుడు అద్భుతంగా తీర్చిదిద్దాడట. ఈ సినిమా ఫ‌స్టాఫ్ చూసుకుంటే క‌థ‌నం ఆస‌క్తిక‌ర స‌న్నివేశాల‌తో చాలా స్పీడ్‌గా ముందుకు వెళుతుంది. రాజేశేఖ‌ర్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) అధికారిగా పనిచేస్తుంటాడు. ఓ హ‌త్య‌కు సంబంధించిన కేసును డీల్ చేస్తోన్న టైంలో దాని వెన‌క ఉన్న డ్ర‌గ్ మాఫియా, అక్ర‌మ మైనింగ్‌ల‌లో చీక‌టి కోణాలను బ‌య‌ట పెడ‌తాడు. ఫ‌స్టాఫ్‌లో పైన చెప్పుకున్న అంశాల‌ను రాజశేఖ‌ర్ ద‌ర్యాప్తు చేసే స‌న్నివేశాలు ద‌ర్శ‌కుడు చాలా ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించాడు. అయితే సెకండాఫ్‌పై మాత్రం దర్శకుడు పట్టుకోల్పోయాడని టాక్.

తొలిభాగాన్ని తీసినంత ఆసక్తికరంగా రెండో భాగాన్ని తెరకెక్కించలేకపోయారట. అన్ని సినిమాల్లో ఉన్నట్టే రొటీన్ సెకండాఫ్ అని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. మొత్తానికి సినిమా అయితే బాగుందని ప్రేక్షకుల మాట. రాజశేఖర్ మరోసారి తన అద్భుతమైన నటనతో కట్టిపడేసారట. తొలిభాగం చాలా థ్రిల్లింగ్, ఒక రేస్‌లా పరిగెత్తిందని.. ఇంటర్వల్ బ్యాంగ్ అయితే గూస్‌బంప్స్ అని విశ్లేషకులు అంటున్నారు. సెకండాఫ్‌లో ప‌లు కీల‌క మ‌లుపులు తిరుగుతుంది. అయితే ఫ‌స్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌లో మాత్రం కాస్త స్లో అయిన‌ట్టు అనిపిస్తుంది. ఇక సినిమాలో ప్ల‌స్‌ల విష‌యానికి వ‌స్తే క‌థ‌నం, వేగం, ఫ‌స్టాఫ్‌, గ్రాండ్ విజువ‌ల్స్‌, భారీ బ‌డ్జెట్‌, ఉత్కంఠ క‌లిగించే సీన్లుగా చెప్పుకోవ‌చ్చు. ఇక సెకండాఫ్ విష‌యానికి వ‌స్తే ఫ‌స్టాఫ్‌తో పోలిస్తే క‌థ‌నం కాస్త స్లో అవ్వ‌డం చిన్న మైన‌స్‌.

సినిమాను చాలా రిచ్‌గా నిర్మించారట. ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్ అని, సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం సినిమాకు మరో బలమని టాక్. మొత్తానికి కష్టకాలంలో ఉన్న రాజశేఖర్‌‌కు గరుడవేగ టాక్ కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే ఈ సినిమా ఏ మేర కలెక్షన్లు రాబడుతుందో చూడాలి. రేస్‌లో వెనకబడిన రాజశేఖర్‌, ఇప్పటి వరకు కమర్షియల్ హిట్ అందుకోని దర్శకుడు ప్రవీణ్ సత్తారును నమ్ముకుని సినిమా తీసిన నిర్మాతలు ఎం.కోటేశ్వరరాజు, మురళి శ్రీనివాస్ జేబులు ఎంతమేర నిండుతాయో మరి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat