ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన దుబారా ఖర్చు కోసం ప్రజాధనాన్ని వినియోగించనున్నారు .గత మూడున్నర ఏండ్లుగా అధికారాన్ని పదవిని అడ్డుపెట్టుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తోన్న దుబారాను అడ్డుకునే వ్యవస్థే ప్రస్తుతం కనుచూపు మేరలో ఎక్కడ కనిపించడం లేదు.
ఒక వైపు పేద రాష్ట్రం అంటూ బీద అరుపులు అరుస్తూనే మరోవైపు తన సొంత విలాసాల విషయంలో మాత్రం బాబు ఎక్కడా తగ్గడం లేదు. ఇప్పటికే జిల్లా పర్యటనలకు వెళ్లినా ఏ ముఖ్యమంత్రికి లేని తరహాలో ప్రత్యేక విమానంలో సమీప ఎయిర్‌పోర్టుకు చేరడం, ఆ తర్వాత ప్రత్యేక హెలికాప్టర్‌లో కార్యక్రమ వేదిక వద్దకు వెళ్లడం చేస్తున్నారు చంద్రబాబు.దీనికోసం ఏకంగా డెబ్బై ఐదు కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోన్నారు .
అంతే కాకుండా దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేని విధంగా చంద్రబాబుకు మూడు కాన్వాయ్‌లు ఉన్నాయి.ఈ క్రమంలో రాష్ట్రంలో విశాఖ, విజయవాడ, తిరుపతికి వెళ్లే ఆయా చోట్ల వేర్వేరు కాన్వాయ్‌లు వాడుతున్నారు. ఇప్పుడు తాజాగా మరోసారి కొత్త కాన్వాయ్ కొనుగోలుకు ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. గత మూడేళ్లలో ఇప్పటికే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కాన్వాయ్‌లను కొన్నారు. తొలుత సపారీ వాహనాలు ఏర్పాటు చేసుకున్నా ఆ తర్వాత ఫార్చునర్ వాహనాలు కొన్నారు. ఇప్పుడు ఏకంగా రూ. 5 కోట్ల 65 లక్షలతో కొత్త కాన్వాయ్ కొనుగోలుకు నిధులు విడుదలయ్యాయి.