రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది.కొత్తగా వచ్చిన 2000 రూపాయల నోట్లను రద్దు చేస్తుంది. ఈ ఆర్ధిక సంవస్సరం లో రెండు వేల రూపాయల నోట్లు ప్రింట్ చేయలేదు.దీనివెనుక పెద్ద కారణాలే ఉన్నాయని సమచారం.
పెద్ద నోట్ల రద్దు విఫలమయిందని విమర్శలు చెలరేగడంతో కేంద్రం ఇరకాటంలో పడింది.. దిద్దుబాటు చర్యలపై మల్లగుల్లాలు పడుతోంది. రద్దు చేసిన నోట్ల స్థానంలో తెచ్చిన 2000 రూపాయల నోటును కూడా త్వరలో రద్దు చేసేస్తారని ఈ మధ్య చాలా ఆంగ్ల దిన పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఇటీవల ఒక టీవీ చానెల్ సమాచార హక్కు చట్టం కింద వివరణ అడగ్గా, ఆర్‌బీఐ అనుబంధ ప్రింటింగ్ సంస్థ-సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూ.2000 నోట్లను ముద్రించాలని ఆర్‌బీఐ నుంచి తమకు ఎలాంటి ఆదేశాలూ, ప్రింట్ ఆర్డర్ రాలేదని బదులిచ్చింది.
‘‘ప్రస్తుతం రూ.500 నోట్లను, రూ.5, రూ.2 నోట్లను మాత్రమే ముద్రిస్తున్నాం’’ అని ఆ సంస్థ పేర్కొంది. దీంతో రూ.2000 నోటు రద్దు తథ్యం అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్‌బీఐ ఆదేశాలు రాకపోవడం తాత్కాలిక వ్యవహారమేనా? లేక కేంద్ర నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఆదేశాలు జారీ చేయడం లేదా అన్నది తెలియాల్సి ఉంది. ప్రవేశపెట్టిన ఏడాదిలోగానే ఉపసంహరించేస్తే నోట్ట రద్దు నిర్ణయం విఫలమన్న విమర్శలకు బలం చేకూర్చినట్లు అవుతుందని కేంద్రం భావిస్తోంది. ఈ 2000 రద్దుపై కేబినెట్లో గానీ, వేరే స్థాయిలో గానీ చర్చే జరగలేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెబుతున్నారు