తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ మనసులో సీఎం పీఠంపై ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి? తన తండ్రి ముఖ్యమంత్రిగా సాగిస్తున్న పరిపాలనపై ఆయన భావాలు ఏంటి? కాంగ్రెస్ పార్టీ చేస్తున్న గోబెల్స్ ప్రచారంపై కేటీఆర్ స్పందన ఏంటి? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలకు బీబీసీ తెలుగు చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్ సమాధానాలు ఇచ్చారు.
తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రిగా మీ పేరు వినిపిస్తోందని సదరు జర్నలిస్టు ప్రస్తావించగా…“సీఎం కేసీఆర్ ఎప్పుడో ఒకప్పుడు నన్ను సీఎం చేస్తారు అనేది కొందరి ప్రచారమే. నాకు అలాంటి లక్ష్యాలు లేవు…..ఎజెండాలు లేవు. నేను మంత్రి అవుతాననే అనుకోలేదు. ఇదే నా స్థాయికి ఎక్కువ. నాకంటే తెలివైన వారు లక్షల వేలమంది ఎక్కువ ఉన్నారు. సీఎం కావాలి, పీఎం కావాలి వంటి పిచ్చి ఆశలు లేవు“ అని స్పష్టం చేశారు.
తెలంగాణకు కేసీఆర్ లాంటి సమర్థుడు, సత్తా ఉన్న ముఖ్యమంత్రిగా ఉండాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. “కేసీఆర్ వంటి నేత అరుదు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ చిటికెన వేలికి సరిపోయే నేతలు లేరు. సీఎం కేసీఆర్ పరిపాలన తీరు సంక్షేమం అభివృద్ధి మేళవింపు. రాబోయే ఇరవై ఏళ్లు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలి. పశ్చిమబెంగాల్ సీఎం జ్యోతిబసు రికార్డును బద్దలు కొట్టాలని ఆకాంక్షిస్తున్నాను.’ అని అన్నారు.
Post Views: 145