తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ పేజ్ త్రీ సెలబ్రిటీలతో సమానంగా ఫాలోయింగ్ ఉన్న నాయకుడనే సంగతి తెలిసిందే. సహజంగా ఈ కేటగిరీలో ఉన్నవారు వారాంతాల్లో సరదాగా గడుపుతుంటారు..అయితే బిజీ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఏం చేస్తుంటారు అనే ఆసక్తి అందరికీ ఉండే సంగతి తెలిసిందే. దీనికి బీబీసీ తెలుగులో ఇంటర్వ్యూలో ఆయనే క్లారిటీ ఇచ్చారు.
మీ వారాంతాలు ఎలా ఉంటాయనే ప్రశ్నకు మంత్రి కేటీఆర్ స్పందిస్తూ…“వీకెండ్లు పెద్దగా ఏం లేవు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ పోయి వర్క్ మాత్రమే మిగిలింది! ఇంట్లో వాళ్లు కూడా ఇదే అంటుంటారు.“ అని మంత్రి కేటీఆర్ అన్నారు. మంత్రి కాకపోయుంటే ఏం చేసేవారని సదరు పాత్రికేయుడు ప్రస్తావించగా..“` మంత్రి కాకపోయి ఉంటే…ఇప్పుడు అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని“ అని అన్నారు.
కేటీఆర్ ఆధ్యాత్మికవాది కాదని అంటుంటారనే వాటిలో నిజం ఎంత అని ప్రశ్నించగా..“నేను హేతుబద్ధంగా ఉంటాను. కొన్నింట్లో సైంటిఫిక్‌గా ఉండటమే మేలని నా భావన.అయితే ఎవరి నమ్మకాలు వారివి. ఇతరుల మనోభావాలను గౌరవిస్తాను. వారిపై నేను ఎప్పుడూ ఒత్తిడి చేయను.“ అని స్పష్టం చేశారు.
Post Views: 205