రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. ఐర్‌సీటీసీలో తమ ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేసుకున్న ప్రయాణికులు ఒకే నెలలో ఇకపై 12 టికెట్లు వరకు బుక్ చేసుకునే సౌలభ్యం కల్పిస్తోంది. ఇంతకుముందు ఈ సంఖ్య 6గా ఉండేది.
అక్టోబర్ 26 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చినట్లు ఐఆర్‌సీటీసీ అధికారులు వెల్లడించారు. దీని ద్వారా తమ ఐఆర్‌సీటీసీ ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేసుకునే వారి సంఖ్య పెరుగుతుందని పేర్కొన్నారు. టికెట్ బుకింగ్ విషయంలో మోసాలను అరికట్టేందుకు ఐఆర్‌సీటీసీ ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది.
ఆరు కంటే ఎక్కువ టికెట్లు బుక్ చేసుకోవాలనుకునేవారు తమ ఆధార్ నెంబర్ వివరాలను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం వెబ్‌సైట్‌లోని ఆధార్ కేవైసీ ఆప్షన్‌పై క్లిక్ చేసి మై ప్రొఫైల్ కేటగిరీలో అప్‌డేట్ బటన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత మొబైల్‌కి వచ్చిన ఓటీపీ(వన్‌టైమ్ పాస్‌వర్డ్)ను ఎంటర్ చేస్తే ఆప్‌డేట్ అవుతుంది.
ప్రస్తుతం ఐఆర్‌సీటీసీలో జనరల్ కోటాలో ఒక టికెట్‌పై ఆరుగురు ప్రయాణించే వెసులుబాటు ఉంది. తత్కాల్ విషయంలో మాత్రం ఒక టికెట్‌పై నలుగురు ప్రయాణానికి అనుమతిస్తారు. ఐఆర్‌సీటీసీతో ఆధార్ అనుసంధానం చేసుకుంటే ఏప్రిల్ నుంచి రాయితీ ఉంటుందని 2016 డిసెంబర్‌లో రైల్వే శాఖ ప్రకటించింది. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ నిర్ణయాన్ని వెనక్కితీసుకుంది.
Tags Good News indian railway irtc passengers