ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో తన ప్రతిభనంతా ప్రదర్శిస్తోంది కాజల్ అగర్వాల్. ప్రత్యేకించి ఎక్కడికి వెళితే అక్కడ ప్రాంతీయ సెంటిమెంట్ ను పండించడానికి ఈ హీరోయిన్ అపసోపాలు పడుతోంది.తాజాగా లేలేత భానుడు తాకుతున్న వేల.. గోరు వెచ్చని ఎండలో.. అందాల ఫ్రెంచ్ రివేరా వద్ద.. అంతే అందంగా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్. ప్రస్తుతం హాలిడే వెకేషన్లో భాగంగా పారిస్ లో ఉన్న ఈ భామ అక్కడ నుంచి ఈ అందమైన ఫొటోను పోస్టు చేసింది. మెరిసిపోతున్న కాజల్ ను చూసి మురిసిపోతున్నారు ఆమె ఫ్యాన్స్. ఈ మేరకు ఇన్‌స్టాగ్రమ్‌లో కాజల్ ను పొగిడేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఖైదీ నంబర్ 150, నేనే రాజు నేనే మంత్రి వంటి సినిమాలతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన కాజల్ ప్రస్తుతం ఎమ్ఎల్ఏ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. స్టార్ హీరోల సరసన వరసగా అవకాశాలు పొందుతోంది.