వనస్థలిపురంలోని నారాయణ కాలేజిలో గ్యాంగ్‌వార్ జరగడం కలకలం రేపుతోంది. నిక్ నేమ్‌తో పిలిచినందుకు ఇంటర్ విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. తరగతి గదిలో నిక్ నేమ్‌లతో పిలుస్తున్నాడని మల్లికార్జున్ అనే విద్యార్థిని 20 మంది తోటి విద్యార్థులు చితకబాదారు.
అంతేగాక తలపై రాళ్లతో కొట్టడంతో అతనికి తీవ్ర రక్తస్రావమైంది. ఈ సంఘటనకు కారణమైన ఐదుగురి విద్యార్థులపై బాధిత విద్యార్థి ఫిర్యాదు చేశాడు. వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.