Home / SLIDER / ఉద్యోగాల విష‌యంలో కాంగ్రెస్ ఇజ్జ‌త్ తీసేసిన మంత్రి కేటీఆర్‌

ఉద్యోగాల విష‌యంలో కాంగ్రెస్ ఇజ్జ‌త్ తీసేసిన మంత్రి కేటీఆర్‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఆత్మ‌వంచ‌న చేసుకుంటూ ముందుకు సాగుతున్నార‌ని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. తాము చేయ‌ని కామెంట్ల‌ను త‌మ‌కు ఆపాదిస్తూ…వారు చిల్ల‌ర ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. బీబీసీ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న స్పందిస్తూ…`ఇంటికో ఉద్యోగం విషయంలో ప్రచారం సరికాదన్నారు.‘కాంగ్రెస్‌ వారు ఏపీలో చంద్రబాబు మ్యానిఫెస్టోను మాకు ఆపాదిస్తున్నారు. ఇంటికో ఉద్యోగమని ఆధారాలతో చూపిస్తే..అంటే…ఇక్కడే రాజీనామా చేస్తా…లక్ష ఉద్యోగాలు అన్నాం…లక్షా 12వేలు ఇస్తాం. ఈ విషయం తెలియని వారు..తిమ్మిని బమ్మిని చేస్తే అది వారికి ఖర్మ. అలాంటి త‌ప్పుడు ప్ర‌చారంతో వాళ్లు సంతోష ప‌డుతున్నారు“ అంటూ వ్యాఖ్యానించారు.
  అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌, మంత్రి ఈటల చెప్పినట్లు ఏ ప్రభుత్వం అందరికీ ఉద్యోగం అందరికీ ఇవ్వలేదు. ఈ విషయం ఒప్పుకోకుండా నిజం తెలిసిన‌ప్ప‌టికీ…కాంగ్రెస్ ఆత్మవంచన చేసుకుంటోంది అని మంత్రి కేటీఆర్ అన్నారు. “గోల్కొండ వేదికగా సీఎం కేసీఆర్ ల‌క్ష ఉద్యోగాలను భ‌ర్తీ చేస్తామ‌ని ప్రకటించారు. దాన్ని తూచా త‌ప్పకుండా పాటిస్తాం…మేనిఫెస్టోలో మేం చెప్పింది చూడండి. ఐదేళ్ల‌లో ల‌క్ష కంటే మ‌రో ప‌న్నెండు వేల ఉద్యోగాలు అధికంగా భ‌ర్తీ చేస్తాం. టీఎస్‌పీఎస్‌సీ సమర్థంగా పనిచేస్తోంది. యూపీఎస్సీ కూడా టీఎస్‌పీఎస్‌సీని ఆదర్శంగా తీసుకోమని సూచించారు. ఏపీపీఎస్సీలో ఉన్న స‌మ‌యంలోవ‌లే.. అవినీతి, పైరవీలు లేకుండ చేయట్లేదు. ఐదేండ్లలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం“ అని స్ప‌ష్టం చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat