నాని సరసన మజ్ను చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన భామ అను ఇమ్మాన్యుయేల్. ఆ సినిమా సక్సెస్ తరువాత రాజ్ తరుణ్‌తో కిట్టు ఉన్నాడు జాగ్రత్త చిత్రంలో నటించింది. తాజాగా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సరసన త్రివిక్రమ్ చిత్రంలో నటిస్తోంది. అయితే, ఈ మూడు సినిమాలను పక్కన పెడితే.. అసలు అను తెలుగు తెరకు పరిచయమైన సినిమా ఏదో తెలుసా? ఆక్సిజన్ చిత్రం.
గోపీచంద్ హీరోగా, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, రకరకాల కారణాల నవంబర్ 17న రిలీజ్ కానుంది.
కాగా, ఆక్సిజన్ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఈ మధ్యనే మీడియా ముందుకొచ్చింది ఈ భామ. డీప్ క్లీవేజ్‌తో వచ్చి షాక్ ఇచ్చింది అను ఆమ్మాన్యుయేల్. ఇక ఆక్సిజన్ చిత్రంలో కూడా తెగ గ్లామర్ ఒలకపోసినట్టుంది ఈ భామ. ట్రైలర్‌లో.. టీజర్‌లో అందాల ప్రదర్శన చేసింది. అను అందాలతో ప్రేక్షకులు ఎలా ఫిదా అవుతారో.. తెలియాలంటే నవంబర్ 17 వరకు వేచి చూడాల్సిందే.