తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్ రెడ్డి ఇటీవల దేశ రాజధాని నగరం ఢిల్లీలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి విదితమే .రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనక పెద్ద కుట్ర ఉన్నది అని దుబ్బాక అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తెలిపారు .
శాసనసభ హాల్ లో మీడియాతో మాట్లాడుతూ సోలిపేట రాష్ట్రంలో శరవేగంగా సాగుతున్న సాగునీటి త్రాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవడానికి చంద్రబాబు వదిలిన బాణం రేవంత్ రెడ్డి అని ఆయన వ్యాఖ్యానించారు .చంద్రబాబు పై రేవంత్ ప్రకటిస్తున్న విశ్వాసం ,అయన చేస్తున్న ప్రకటనలే అందుకు నిదర్శనం అని ఆయన అన్నారు .
కేసీఆర్ ప్రభుత్వం అటు గోదావరి ,ఇటు కృష్ణా నదుల మీద కడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోవడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలేమీ ఫలించకపోవడంతో చివరి అస్త్రంగా రేవంత్ రెడ్డిను కాంగ్రెస్ పార్టీలో చేరమని చెప్పి ఉంటారు అని ఆయన అన్నారు .టీడీపీ పార్టీకి ,పదవులకు రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి నోటుకు ఓటు కేసులో చంద్రబాబు ఎంతమంది ఎమ్మెల్యేలను కొనమని ఎంత ఇచ్చాడు అని గుట్టు విప్పితే తెలంగాణ ప్రజలు ఆయన విశ్వసనీయతను నమ్ముతారు అని అన్నారు .