తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పంచాయితీ ,మున్సిపల్ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సమక్షంలో నిన్న కోడంగల్ నియోజక వర్గానికి చెందిన దాదాపు పదమూడు వందల మంది టీడీపీ ,కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ,కార్యకర్తలు టీఆర్ఎస్ భవన్ లో టీఆర్ఎస్ గూటికి చేరారు .ఈ సందర్భంగా మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ స్వాతంత్రం అనంతరం పలు కుంభకోణాలకు పాల్పడిన కుంభ కోణాల కాంగ్రెస్‌లోకి దేశ స్థాయిలో తెలంగాణ ముఖ్యంగా కోడంగల్ ప్రజల పరువు తీసిన ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన మరో దొంగ రేవంత్‌రెడ్డి చేరాడని విమర్శించిన సంగతి తెలిసిందే.అంతే కాకుండా రైఫిల్ రెడ్డి ఇప్పుడు పిట్టల దొరలా మారాడని మంత్రి కేటీరామారావు ఎద్దేవా చేశాడు .
అయితే ఈ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తూ తన ఫేస్‌బుక్‌లో ‘ఇదిగో కేటీఆర్ దాచిన ”సత్యం”…!’ అనే శీర్షికతో ఓ ఫొటో పోస్ట్ చేశారు.2016లో జరిగిన అఫీషియల్ ప్రోగ్రాంలో ”అనఫిషియల్”గా తేజారాజు S/O సత్యం రామలింగరాజుతో మలేషియన్ ప్రధానిని కలిసి మంతనాలాడిన స్కాం స్టార్ కేటీఆర్‌కు ముందుంది ”క్రోకోడైల్ ఫెస్టివల్” అని రేవంత్ రెడ్డి ఘాటుగా రిప్లై ఇచ్చారు.అయితే మంత్రి కేటీరామారావు కు కౌంటర్ ఇచ్చే సమయంలో వెనక ముందు ఆలోచించకుండా తేజరాజుమంత్రి కేటీ రామారావుతో ఉన్న ఫోటో పోస్టు చేశాడు .అయితే సత్యం రామలింగరాజు అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి ప్రస్తుత నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హాయంలో పలు కుంభ కోణాలకు పాల్పడ్డాడు .పలు అక్రమాలు చేశాడు .
చంద్రబాబు తనయుడు లోకేష్ చదువుల కోసం కొన్ని కోట్ల రూపాయలు కూడా అప్పట్లో సమర్పించుకున్నాడు అనే ఆరోపణలు కూడా వచ్చాయి .అయిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహచర ఎమ్మెల్యేను కొనబోయి అడ్డంగా దొరికిన రేవంత్ ఆ విషయాన్నీ మరిచి తండ్రి తప్పు చేస్తే అదేదో కొడుకు చేసినట్లు కొడుకుతో దిగిన ఫోటోను పోస్టు చేస్తూ మంత్రి కేటీ రామారావు ను బుక్ చేద్దామని అడ్డంగా తను దొరికిపోయాడు . దేశంలో అత్యంత స్కాము లలో పాత్ర ఉన్న సీఎం చంద్రబాబు అని అప్పట్లో తెహల్కా డాట్ కామ్ ప్రచురించిన కథనాన్ని మరిచి ..అదే నాయకుడు కింద పనిచేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరినంత మాత్రాన పునీతుడు అయినట్లా ..ఇప్పుడు కేటీ రామారావు దేశ రాజకీయాల్లోనే మోస్ట్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ..ఆయనతో ఎవరైనా సెల్ఫి లు దిగుతారు .అంతమాత్రాన వాళ్లతో మంత్రి కేటీ రామరావుకు లింక్ ఉన్నట్లా అని నెటిజన్లు రేవంత్ పోస్టు కింద కామెంట్లు చేస్తోన్నారు .మంత్రి కేటీ రామారావు నిన్న పక్క ఆధారాలతో రేవంత్ పై విరుచుకుపడితే ఇవాళ రేవంత్ కనీస విషయ అవగాహన లేకుండా ఒక ఫోటోను పోస్టు చేస్తూ విమర్శలు చేయడం రేవంత్ దిగజారుడు తనానికి నిదర్శనం అని నెటిజన్లు విరుచుకుపడ్డారు.