తెలుగు సినీ వర్గీయుల్లో ఓ వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ న్యూస్ ఏమిటంటే దర్శకుడు సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ రంగస్థలం 1985 చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రం మొదలు పెట్టుకుని నెలలు గడుస్తున్నా ఈ సినిమా షూటింగ్ మాత్రం ఒక కొలిక్కి రాలేదు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సమంత సీన్స్ అన్ని షూట్ చేసినా.. మిగతా చాలా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అలాగే చాలా పాటల చిత్రీకరణ కూడా పెండింగ్ లోనే ఉంది. దీంతో సుకుమార్‌కి చెర్రి డెడ్ లైన్ విధించాడనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇక రంగస్థలం సినిమా మొదలు పెట్టి చాలా కాలం గడుస్తున్నా ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడం.. నిర్మాణ ఖర్ఛులు పెరిగిపోవడంతో రంగస్థలం నిర్మాతలు వడ్డీ లెక్కలు అవి వేసుకుంటే.. బడ్జెట్ పరిది దాటిపోతుందని.. అదే విషయాన్నినిర్మాతలు చెర్రి వద్ద ప్రస్తావించరని సమాచారం. దీంతో నవంబర్ కల్లా సుకుమార్‌ని ఈ సినిమా షూటింగ్ పూర్తి చెయ్యమని… లేకుంటే ఆ తర్వాత తన డేట్స్ సర్దుబాటు చేయలేనని చరణ్ సుకుమార్‌కి తేల్చి చెప్పారనే న్యూస్ హల్చల్ చేస్తుంది.
తన తండ్రి నటించనున్న తాజా చిత్రం సై రా నరసింహారెడ్డి సినిమాకి సంబందించిన పనులు ప్రారంభమవుతాయని.. దీంతో నిర్మాతగా తాను బిజీ అవుతానని.. అందుకే రంగస్థలం షూటింగ్‌ని త్వరగా కంప్లీట్ చేసుకోమని సుక్కుతో చరణ్ చెప్పాడట. మరి చరణ్ చెప్పిన డెడ్ లైన్‌కి సుకుమార్ రీచ్ కాగలడా.. లేదా అని చర్చించుకుంటున్నారట సినీ వర్గీయులు. ఎందుకంటే సుకుమార్ తన సినిమాలను హరీబరిగా తెరకెక్కించడు. చాలా నెమ్మదిగా తన సినిమాని నీట్ అండ్ క్లీన్‌గా చెక్కుతూనే ఉంటాడు. మరి సుకుమార్ ఏం చేస్తాడో చూడాలని సర్వత్రా చర్చించుకుంటున్నారు.