Home / MOVIES / మెగాస్టార్ వ‌స్తే ఏ రేంజ్‌లో ఉంటుందో..?

మెగాస్టార్ వ‌స్తే ఏ రేంజ్‌లో ఉంటుందో..?

మెగా స్టార్ చిరంజీవి.. యాంగ్రీ యంగ్‌మాన్ రాజ‌శేఖ‌ర్‌ల మ‌ధ్య విబేధాలు గ‌తంలో తార‌స్థాయిలో ఉండేవ‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే తాజాగా రాజశేఖర్ స్వయంగా తన పిఎస్వీ గరుగవేగ చిత్రం ప్రీమియ‌ర్ షో చూసేందుకు చిరంజీవిని ఆహ్వానించటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. చిరంజీవి సినిమా చూడటానికి వస్తే వీళ్ల మధ్య మళ్లీ స్నేహబంధం మళ్లీ మొదలైనట్లే అనే అని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

హీరో రాజశేఖర్ నటించిన చిత్రం గరుడవేగ వచ్చే శుక్రవారం విడుదల కాబోతున్న నేపధ్యంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇక ప్రీమియర్ షోకు పిలిస్తేనే ఇంతలా చెప్పుకుంటున్నారు.. ఒక‌వేళ చిరంజీవి కనుక వచ్చి ఈ సినిమా గురించి మాట్లాడితే.. ఇదే విష‌యం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

ఈ చిత్రంలో స్పెషల్ అట్రాక్షన్‌గా సన్నీ లియోన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా సార్లు స్టేజిలపై ఖచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నారు. మరోవైపు ఈ చిత్రం ప్రీమియర్‌ను చూసేందుకు రావాల్సిందిగా మెగాస్టార్ చిరంజీవిని రాజశేఖర్ దంపతులు ఆహ్వానించటం కూడా సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తోందని.. సోషల్ మీడియా పెద్ద ర‌చ్చే జ‌రుగుతోంది.

రాజశేఖర్- ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం పి.ఎస్.వి గరుడ వేగ 126.18ఎం. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం నవంబర్ 3న విడుదల కానుంది. పూజా కుమార్, శ్రద్ధా దాస్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో సన్నీ లియోన్ స్పెషల్ సాంగ్‌తో అలరించనుంది. జార్జియా, థాయ్ లాండ్ వంటి అందమైన ప్రదేశాలలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంది.

ఇక ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఎఫ్ ఎం స్టేషన్ కి వెళ్లిన రాజశేఖర్, పూజా కుమార్, శ్రద్ధా దాస్ అక్కడ డియో డియో అనే పాటకి స్టెప్పులేశారు. ఒరిజినల్ గా సినిమాలో ఈ పాటకి సన్నీ మాత్రమే స్టెప్పులేస్తుంది. కాని ప్రమోషన్ లో భాగంగా ముగ్గురు స్టార్స్ వేసిన స్టెప్స్ నెటిజన్స్ ని ఎంతగానో అలరిస్తున్నాయి. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయింది.

గరుడ వేగ చిత్రంలో జార్ణ్ అనే కరుడు గట్టిన విలన్ పాత్రలో కిషోర సహా నటిస్తున్నాడు. నాజర్, పోసాని , అలీ, పృధ్వీ, షియాజీ షిండే, అవసరాల శ్రీనివాస్, శత్రు, సంజయ్ స్వరూప్, రవివర్మ, చరణ్ దీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో, శ్రీ చరణ్ పాకాల చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat