తెలుగు చిత్రాల్లో తల్లిగా అత్తగా నటిస్తోన్న ప్రగతి తనకు సినీ రంగంలో అడుగు పెట్టినప్పుడు ఎదురైన ఆశక్తికరమైన అంశాలను బయటపెట్టింది.
ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రగతి ఆంటీ.. తాను అక్కాచెల్లెళ్లు సీరియల్ చేస్తుండగా సురేశ్ ప్రొడక్షన్స్ నుంచి కాల్ వచ్చిందని తాము నిర్మించనున్న కొత్త సినిమాలో హీరోయిన్ ఆర్తీ అగర్వాల్‌కి మదర్‌గా నటించవలసి ఉంటుందని చెప్పారు.
సురేశ్ ప్రొడక్షన్స్ నుండి కాల్ వచ్చినా… నటించమంటుంది తల్లి క్యారెక్టర్లో.. అది కూడా ఇంచు మించు తన వయసు ఉన్న అమ్మాయితో.. కాస్త ఇబ్బంది అనిపించి సరే అని అయిష్టాంగానే ఓకే చెప్పానని చెప్పింది. ఇక అక్కాచెల్లెళ్లు సీరియల్లో తన తల్లి క్యారెక్టర్లో నటిస్తున్న శ్రీ విద్య ఆ సమయంలో నా ఎదురుగానే వున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్ నుంచి కాల్ వచ్చిందంటూ ఆమెకి విషయం చెప్పాను. అప్పుడు శ్రీ విద్య మేడమ్ ఇచ్చిన సలహాలు నా జీవితాన్నే మార్చాయి.
నువ్వు సినిమా ఇండస్ట్రీలో చాన్సుల కోసం ఎదురు చూసే సమయం, ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఉంటే.. అమ్మ, అక్క, వదిన, ఎవరైతే ఏంటి.. నటించాలి. ఒకవేళ హీరోయిన్గా రాణించాలనుకుంటే కాస్త టైమ్ పడుతుంది. ఒకవేళ రావొచ్చు..రాకపోవచ్చు. తెలుగు ఇండస్ట్రీలో సురేశ్ ప్రొడక్షన్స్ చాలా పెద్ద కంపెనీ.. సినిమా ఎలా వున్నా నీకు మంచి పేరు వస్తోంది. ఇప్పుడు ఫోన్ చేసి నువ్ ఆ పాత్ర చేస్తున్నట్టుగా చెప్పు అంటూ పట్టుబట్టారు. ఆమె ఇచ్చిన ప్రోత్సాహం.. సలహాలు ఇప్పుడు ఈ స్టేజిలో నిలబెట్టాయి. నా కెరియర్ మలుపు తిరగడానికి ఆమెనే కారణం అని చెప్పుకొచ్చారు.