కోలీవుడ్‌లో హీరోయిన్‌గా కొన్ని చిత్రాల్లో నటించిన నటి ప్రగతి.. ఆ తర్వాత టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. తెలుగులో యంగ్ హీరో, హీరోయిన్లకు అమ్మగా, అత్తగా ఎక్కువ పాత్రలు చేశారు ప్రగతి. అయితే టీనేజ్‌లో ఉండగా తనకి హీరోయిన్ ఛాన్స్ ఎలా వచ్చిందనే విషయాలను ప్రగతి ఆంటీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు.
ప్రముఖ దర్శకుడు మణిరంత్రం చిత్రం రోజా చిత్రం విడుదల అయిన రోజుల్లో నేను కొత్తగా జూనియర్ కాలేజ్‌లో చేరాను ఒకసారి నేను ఫ్రెండ్స్ తో ఉండగా అటుగా తమిళ నటి సి.ఆర్.సరస్వతి వచ్చారు. అది రోజా నన్ను చూసిన ఆమె అచ్చం రోజా ఫేం మధుబాల మాదిరిగానే వున్నావంటూ బుగ్గ గిల్లేసింది. ఆ తరువాత మా అమ్మతో మాట్లాడి నా ఫోటో ఒకటి తీసుకెళ్లింది.
ఇక వెంటనే ఆ మరుసటి రోజునే సినిమా ఆఫీస్ నుంచి కాల్ రావడంతో వెళ్లాను. యాక్టింగ్ అంటే ఇష్టమా.. అని వాళ్లు అడిగితే అవునని చెప్పాను. వాళ్లు స్క్రీన్ టెస్ట్ చేసి .. సెలక్ట్ అయినట్టుగా చెప్పారు. కేరక్టర్ ఏంటి అని అడిగితే .. హీరోయిన్ అన్నారు. అంతే ఒక్కసారి అక్కడి నుంచి బయటికి వచ్చేసి ఆనందంతో గంతులేశాను. ఆ సినిమాకి హీరో .. దర్శకుడు కె. భాగ్యరాజా అంటూ చెప్పుకొచ్చారు ప్రగతి.