టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తండ్రి అయిన విషయం తెలిసిందే. ఇటీవల పవన్ అన్నాలెజ్‌నోవా దంపతులకు పండంటి బాబు పుట్టాడు. ఇక తాజాగా ఆ బాబు పవన్ పేరు పెట్టాడు. ఇప్పుడు ఆ పేరే సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పాటు ఆ పేరుపై పెద్ద చర్చే నడుస్తోంది. ఇంతకీ ఆ పేరు ఏంటనేగా.. మార్క్ శంకర్ పవనోవిచ్ కొణిదెల.. వినడానికి కొత్తగా, కొంత వింతగా ఉన్న ఈ పేరు గురించి ఇప్పుడు పెద్ద రచ్చే జరుగుతోంది.
పవన్ భార్య లెనిజోవా సంప్రదాయాలను తూ..చా తప్పకుండా పాటిస్తోంది. రష్యన్ ఆర్థోడక్స్ మత సంప్రదాయాలను పాటించే ఆమె తన బిడ్డ పేరు కూడా సంప్రదాయబద్ధంగానే ఉండాలని భావించిందట. క్రైస్తవంలో మార్కస్ అనే దేవుడికి సంక్షిప్త రూపంగానే తన బిడ్డ పేరుకు మొదట మార్క్ అని, చిరంజీవి అసలు పేరు నుంచి శంకర్‌ను, పవన్ పేరు నుంచి పవనోవిచ్.. వీటిన్నింటినీ కూర్చి మార్క్ శంకర్ పవనోవిచ్ అని పెట్టారట. దీంతో సోషల్ మీడియాలో మార్క్ శంకర్ పవనోవిచ్ పేరు గురించి పెద్ద చర్చే జరుగుతోంది.