సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కల్గిన నాలుగో సంతానంగా మగ బిడ్డ పుట్టిన విషయం తెలిసిందే. అయితే పవన్ తాజాగా తన కొడుకుకి మార్క్ శంకర్ పవనోవిచ్ అనే పేరును పెట్టిన విషయం తెలిసిందే. అయితే మామూలుగానే పవన్ నీడను కూడా ఫాలో అయ్యే వర్మ ఊరుకుంటాడా.. మరోసారి పవన్ కొడుకు పేరుపై స్పందించాడు. అయితే ఇక్కడున్న మరో ట్విస్ట్ ఏంటంటే.. వర్మతో ఆయన కుమార్తె మాటల యుద్ధానికి తెరలేపింది.
అసలు విషయం ఏంటంటే.. ఈ పేరుకు, చరిత్రకు ఉన్న సంబంధాన్ని తెలుపుతూ.. ఈ నేమ్ అతి గొప్పదని వర్మ కామెంట్ చేశారు. దీంతో లైన్‌లోకి వచ్చిన వర్మ కుమార్తె ఈ పోస్టులో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదని చెప్పింది. సామాన్యులకు అందని పదాలు వాడుతూ పోస్టులు చేయడాన్ని తప్పుబట్టింది. ఏం పనీలేక ఇలాంటి పోస్టులు పెడుతున్నారని ఆక్షేపించింది. చరిత్రకు, ఈ పేరుకు పొంతన ఎక్కడుందని నిలదీసింది.
ఇక స్వతహాగా పవన్‌కు పెద్ద ఫ్యాన్ అయిన తన కుమార్తె వ్యాఖ్యలను ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేసిన వర్మ, సమాధానాన్నీ ఇచ్చాడు. నీకసలు అర్థం చేసుకోవడం రానే రాదనే విషయం నువ్వు రాసిన కామెంట్ చూస్తేనే అర్థం అవుతోందని అక్షింతలు వేశాడు. మీ అందరికంటే పవన్ కల్యాణ్ ను తాను ఎక్కువగా ప్రేమిస్తున్నానని, తాను ప్రేమించినంతగా మరెవరూ ప్రేమించలేరని చెప్పాడు. దీంతో ఈ మ్యాటర్ అంతా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.