Home / MOVIES / ఎన్టీఆర్ రెండ‌వ భ్యార్య.. ల‌క్ష్మీ పార్వ‌తి కాదా..?

ఎన్టీఆర్ రెండ‌వ భ్యార్య.. ల‌క్ష్మీ పార్వ‌తి కాదా..?

తెలుగు సంచ‌ల‌నం విశ్వ‌విఖ్యాత.. మాజీ ముఖ్య‌మంత్రి నందమూరి తారక రామారావు గురించి తెలియ‌ని తెలుగు వారు ఉంటారంటే అది అతిశ‌యోక్తి అవుతుందేమో.. ఆయ‌న సినిమాల్లోనే కాకుండా.. రాజ‌కీయాల్లో కూడా ఒక సంచ‌ల‌న‌మే అని చెప్పొచ్చు. అయితే తాజాగా ఆయ‌న‌కు సంబంధించి ఒక వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఎన్టీఆర్ సినిమాల్లోకి రాకముందే బసవతారకం గారిని పెళ్లి చేసుకున్నారు, ఆవిడా మృతి చెందిన త‌ర్వాత‌ లక్ష్మి పార్వతిని రెండో పెళ్లి చేసుకున్నారని అందరు అంటారు. అయితే ఎన్టీఆర్ జీవితంలో ఎవరికీ తెలియని విషయం ఏంటంటే లక్ష్మీపార్వతి రెండో భార్య కాదు.. మూడో భార్య అంట‌. మరి రెండో భార్య ఎవరు..ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు.. అన్నది తెలుసుకుందాం.

తెలుగు, తమిళ సినీరం 60, 70 దశకాలలో అందాల తారగా వెలుగొంది.. తెలుగు, తమిళ, మలయాళంలలో 150కి పైగా సినిమాలలో నటించింది.. ప్ర‌ముక‌ నటి దేవిక. అప్పట్లో రామారావు గారు సినీ పరిశ్రమ లో నిలదొక్కుకుంటున్న స‌మ‌యంలో బసవ తారకం గారు ఎన్టీఆర్ స్వస్థలం నిమ్మకూరు లోనే ఉండేవారు. ఆ సమయంలో వీరిద్ద‌రి మ‌ధ్య‌ ప్రేమ చిగురించిందనీ, ఎవరికి తెలీకుండా పెళ్లి కూడా చేసుకున్నారని, ఈ విషయం ఎన్టీఆర్ అతి ముఖ్యమైన సన్నిహితులకు మాత్రమే తెలుసని సమాచారం. అప్పట్లో ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ విషయం ఫై బాగా చర్చించుకునే వారట. ఎందుకంటె ఒకానొక దశ లో ఎన్టీఆర్ ప్రతి చిత్రం లో దేవిక నటించేవారు. అది ఎంతలా అంటే ఎన్టీఆర్ సినిమా అంటే దేవిక హీరోయిన్ అని నిర్మాతలు, దర్శకులు, ముందుగానే దేవిక గారి డేట్స్ ని అడిగేవారట.

ఇక ఎన్టీఆర్ అభిమానులు కూడా ఎన్టీఆర్ సినిమా అంటే దేవిక హీరోయిన్ అని చెప్పలేంట్రా అని ఛలోక్తులు విసురుకునేవారట. శభాష్ రాముడు (1959),టాక్సీ రాముడు (1961),రక్త సంబంధం (1962), మహామంత్రి తిమ్మరుసు (1962), దక్షయజ్ఞం (1962), గాలిమేడలు (1962), పెంపుడు కూతురు (1963), నిలువు దోపిడి (1968), భామా విజయం (1967), శ్రీకృష్ణావతారం (1967), గండికోటరహస్యం(1969), విజయంమనదే(1970), చిన్ననాటి స్నేహితులు (1971), రాజకోటరహస్యం (1971), ఇలా ఒక దశాబ్దం పాటు ఎన్టీఆర్ సినిమా అంటే దేవిక ఉంటుంది అనేల వీరు సినిమాలు చేసారు. ఇవే కాదు వీరి కలయికలో ఇంకా చాల సినిమాలు వచ్చాయి. అయితే కొంతకాలానికి వారిద్ద‌రి మ‌ధ్య‌ ఏవో మనస్పర్థలు వచ్చి వీడిపోయారట, ఎలాగూ పెళ్లి విషయం ఎవరికి తెలీదు.. ఎవరైనా అడిగిన అభిమానుల్లో అదొక‌ అపోహ అని చెప్పేవారట. ఇక్కడ మరో విశేషం ఏంటంటే దేవిక, ఎన్టీ రామారావుతో హీరోయిన్‌గా రేచుక్క అనే సినిమాలో తొలిసారి తెరపై కనిపించారు. అదే ఎన్టీఆర్ నిర్మించిన శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాలో చివరి సారిగా నటించారు. మొత్తానికి ఎన్టీఆర్ దేవిక ల పెళ్లి విషయం ఇప్పటికి ఒక మిస్టరీనే అని స‌ర్వ‌త్రా చర్చించుకుంటున్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat