దర్శకుడు త్రివిక్రమ్, నటుడు సునీల్ ఇద్దరూ కూడా మంచి మిత్రులన్న విషయం తెలిసిందే. ఇద్దరూ కూడా తొలి నాళ్లలో సినిమా ఇండస్ర్టీలో కి ఎంట్రీ అయ్యేందుకు చాలా కష్టాలే పడ్డారు. కట్ చేస్తే త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్ అయ్యాడు. ఇక సునీల్ హీరో అయ్యాడు. కానీ, హాస్యనటుడిగా ఉన్నప్పుడే ఎక్కువ పేరు వచ్చింది. దాంతో పాటు డబ్బు కూడా ఎక్కువగానే సంపాదించాడు. అయితే, హీరోగా మారిన తరువాత సక్సెస్‌లు మాత్రం దక్కడం లేదు. దాంతో రేస్‌లో వెనకబడిపోయాడు సునీల్. హీరోగా దెబ్బపడటంతో మళ్లీ హాస్య నటుడిగా నటించడానికి సమాయత్తమవుతున్నాడు సునీల్.
సునీల్ హీరోగా మారటంతో త్రివిక్రమ్, సునీల్ కాంబినేషన్‌కు కొంత గ్యాప్ వచ్చింది. అయితే ఇటీవల కాలంలో హీరోగా పరాజయాలు ఎదుర్కొంటున్న సునీల్ మళ్ళీ కామెడీ బాట పట్టాలనుకుంటున్నాడు. సో కమెడియన్‌గా రీ ఎంట్రీలోనే అదరగొట్టే పాత్ర కావాలని ఎదురు చూస్తున్నాడు సునీల్. ఇప్పుడు ప్రియమిత్రుడు సునీల్ కోసం త్రివిక్రమ్ తన కొత్తసినిమాలో ఓ పాత్రను క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది.
ఎన్టీఆర్ హీరోగా ఈ మధ్యనే కొత్త సినిమా స్టార్ట్ చేశాడు త్రివిక్రమ్. ఆ సినిమాలో ఎన్టీఆర్‌తోపాటు మరో ప్రముఖ పాత్రకు నారా రోహిత్‌ని అనుకున్నారట. కానీ, ఇప్పుడు ఆ పాత్రలో సునీల్ చేయడానికి ముందుకొచ్చాడు. దానికి కారణం త్రివిక్రమ్. సునీత్ తన స్నేహితుడు కావడంతో నారా రోహిత్‌కు అనుకున్న పాత్రను సునీల్‌కు ఇచ్చాడట. సునీల్ ఈ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌తో డౌన్ అవుతున్నాడు మళ్లీ.. ఇక హిట్ అందుకోవడం పెద్ద కష్టం కాదేమో.